సీక్రెట్ కెమెరా – హీరోయిన్.. ఈ కాంబినేషన్ వినేసరికి మనకు ఠక్కున గుర్తొచ్చే విషయం ఓ ప్రముఖ హీరోయిన్. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమా చేస్తోంది ఆ నాయిక. ఆ కెమెరా సంగతి, ఆ వీడియోల సంగతి తర్వాత సమసిపోయింది. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ తనకు గతంలో జరిగిన ఓ సీక్రెట్ కెమెరా పరిస్థితి గురించి వివరించింది. ఆమెనే ‘తీన్మార్’ హీరోయిన్ కృతి కర్బందా.
తాను బస చేసిన ఓ హోటల్ రూమ్‌లో ఓసారి సీక్రెట్ కెమెరాను గుర్తించానని కృతి కర్బందా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కెమెరా ఉందనే విషయం తెలియగానే చాలా భయపడ్డానని కూడా చెప్పింది. ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ నాటి బాధాకరమైన విషయాన్ని వివరించింది. హోటల్లో పనిచేసే ఒక వ్యక్తి ఆమె రూమ్‌లో సీక్రెట్‌గా కెమెరా పెట్టాడట. అయితే ఎక్కడైనా హోటల్ రూమ్‌లో ఉండేటప్పుడు తను, తన టీమ్ చెక్ చేసుకుంటూ ఉంటుందట.
అలా ఆ రోజు కూడా రూమ్‌ను చెక్ చేసినప్పుడు ఆ కెమెరాను గుర్తించాం అని (Star Actress) కృతి చెప్పుకొచ్చింది. టీవీ సెట్ అప్ బాక్స్ వెనుక ఉంచిన కెమెరాను చూసి షాకయ్యానని కృతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాతి నుండి బయట ఎక్కడైనా బస చేయాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అని చెప్పింది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది కూడా. సుమంత్ ‘బోణీ’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన కృతి… పవన్ కల్యాణ్ ‘తీన్మార్’తో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ సంపాదించింది.
అయితే ఆ తర్వాత ‘మిస్టర్ నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’, ‘ఓం త్రీడీ’ సినిమాల్లో నటించింది. రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’లో అక్క క్యారెక్టర్ చేసింది. ఆ సినిమాలు ఆమెకు సరైన విజయం ఇవ్వకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ కూడా ప్రయాణం అంత సాఫీగా ఏమీ లేదు అనే చెప్పాలి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్