Devil Movie: డెవిల్ సినిమా ఫస్ట్ ఆప్షన్ సంయుక్త కాదా?

  • December 30, 2023 / 07:01 PM IST

ప్రముఖ నిర్మాత దర్శకుడు అభిషేక్ నామ దర్శక నిర్మాణంలో కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి కూడా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం కూడా ఉంటుంది అంటూ కళ్యాణ్ రామ్ ఈ సినిమా విడుదలైనటువంటి రోజే వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటి సంయుక్త మీనన్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఈమె ఇది వరకే కళ్యాణ్ రామ్ తో కలిసి బింబి సారా సినిమాల్లో నటించారు. ఈ సినిమా కూడా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా మంచి హిట్ కావడంతో మరోసారి ఈమె కళ్యాణ్ రామ్ సినిమాలో నటించారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో మొదటి ఛాయిస్ హీరోయిన్గా సంయుక్త మీనన్ కాదని తెలుస్తుంది. ఈ సినిమాని ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసిన తరువాతనే ఈమె ఈ సినిమాలో భాగమయ్యారంటూ ఈ వార్త వైరల్ గా మారింది. మరి డెవిల్ సినిమాని మిస్ చేసుకున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే…

కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ (Devil) సినిమాలో ముందుగా హీరోయిన్ సంయుక్త మీనన్ కాకుండా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను తీసుకోవాలని భావించారట ఇదే విషయమే దర్శకుడు వెళ్లి ఆమెను సంప్రదించి కథ మొత్తం చెప్పగా ఆమె మాత్రం ఇలాంటి కథలలో తాను నటించలేను అంటూ సింపుల్ గా ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.ఈ విధంగా మృణాల్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తదుపరి సంయుక్త మీనన్ ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus