Devil Review in Telugu: డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 29, 2023 / 11:11 PM IST

Cast & Crew

  • నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ (Hero)
  • సంయుక్త మీనన్ (Heroine)
  • మాళవిక నాయర్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య, అజయ్ (Cast)
  • అభిషేక్‌ నామా (Director)
  • అభిషేక్‌ నామా (Producer)
  • హర్షవర్ధన్ రామేశ్వర్ (Music)
  • సౌందర్ రాజన్.ఎస్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 29 , 2023

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా అభిషేక్ నామా తొలుత నిర్మాణ సారధ్యం వహించి.. అనంతరం దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించి రూపొందించిన చిత్రం “డెవిల్”. బ్రిటిష్ ప్రభుత్వం నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు (డిసెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!!

కథ: రాసపాడులో జరిగిన ఓ హత్య విషయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్వాల్వ్ అయ్యి.. ఆ కేస్ ను డీల్ చేయడానికి డెవిల్ (కళ్యాణ్ రామ్)ను రంగంలోకి దించుతుంది. అదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియాకి రాబోతున్నారని, ఆయనకి త్రివర్ణ అనే వ్యక్తి సహాయం చేయనున్నాడని తెలుసుకొన్న బ్రిటిష్ ఇంటెలిజెన్స్.. నేతాజీని ప్రాణాలతో పట్టుకోవడానికి పన్నాగం పన్నుతుంది. రాసపాడుకి, నేతాజీకి సంబంధం ఏమిటి? ఇందులో డెవిల్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అసలు త్రివర్ణ ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీని పట్టుకోగలిగిందా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “డెవిల్” చిత్రం.

నటీనటుల పనితీరు: కళ్యాణ్ రామ్ తన లుక్స్ & మ్యానరిజమ్స్ తో డెవిల్ క్యారెక్టర్ లో జీవించేసాడు. అతడి వేషధారణ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు క్యారెక్టర్ & స్టోరీకి మరింత వేల్యూ యాడ్ చేశాయి. సంయుక్త మీనన్ మొదటిసారి అందంగా కనిపించడమే కాక.. కాసిన్ని హావభావాలు పలికించి, తాను కూడా నటించగలను అని నిరూపించింది. ఆమె పాత్రకు ఉన్న వెయిటేజ్ కు న్యాయం చేసింది. మణిమేఖల అనే పవర్ ఫుల్ క్యారెక్టర్లో మాళవిక నాయర్ బాగా చేసింది. ఆమె నటన సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది. నెగిటివి రోల్లో కన్నడ నటుడు వశిష్ట సింహా అలరించాడు. షఫీ, అజయ్, అమ్ము అభిరామి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి పెద్ద ఎస్సెట్. 1940ల కాలం నాటి పరిస్థితులను చాలా లిమిటెడ్ బడ్జెట్ లో చూపించగలిగాడు. అలాగే యాక్షన్ బ్లాక్స్ ను తెరకెక్కించిన తీరు కూడా బాగుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం & పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ వంటివన్నీ బడ్జెట్ కు తగ్గట్లుగా ఉన్నాయి. చాలావరకు చక్కగా మ్యానేజ్ చేశారనే చెప్పాలి.

శ్రీకాంత్ విస్సా సమకూర్చిన కథ-మాటలు-స్క్రీన్ ప్లేను హ్యాండిల్ చేయడంలో దర్శకుడు అభిషేక్ నామా (?) చాలా చోట్ల తడబడ్డాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లేలో బోలెడన్ని ట్విస్ట్స్ & మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. వాటిలో కొన్నిటిని ట్రైలర్ లోనే రిలీజ్ చేయడం అనేది మైనస్ గా మారింది. సీన్లుగా చూస్తే సినిమా బాగానే ఉంటుంది కానీ.. మొత్తంగా చూస్తే సరైన కనెక్టివిటీ లేక చాలా చోట్ల బోర్ కొడుతోంది.

విశ్లేషణ: స్క్రీన్ ప్లేలో లొసుగులు పట్టించుకోకుండా చూడగలిగితే (Devil) “డెవిల్” ఓ మోస్తరుగా ఆకట్టుకునే సినిమా అనే చెప్పాలి. కాకపొతే.. లాజిక్స్ & ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో సూపర్ హిట్ చేరేది.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus