కండోమ్ యాడ్ కోసం హీరోయిన్ ప్రమోషన్!

తెలుగులో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి అనిత.. ఆ తరువాత తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కొన్నాళ్ల కిందటి వరకు రోజువారీగా అత్యధికంగా ఛార్జ్ చేసే హిందీ టీవీ నటీమణుల్లో ముందు వరసలో నిలిచింది అనిత. పెళ్లి తరువాత కాస్త బిజీ అవ్వడంతో సీరియల్స్ తగ్గించింది. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో తన పెర్సనల్, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

అలానే ఇతర ప్రమోషన్స్ యాక్టివిటీస్ తో అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే.. అనిత ఒక కండోమ్ కంపెనీ లేటెస్ట్ మోడల్ కండోమ్స్ ను ప్రమోట్ చేస్తోంది. ఆమె భర్తతో కలిసి ఈ పని చేస్తోంది. ఆ కండోమ్స్ తో ఇంటెన్స్ ప్లెజర్ ఉంటుందన్నట్లుగా ఈ నటీమణి చెప్పడం.. ఈ భార్యాభర్తల మధ్య చిట్ చాట్ తో ఆ ప్రోమోను రూపొందించారు. ఆ కండోమ్ తో అద్భుతమైన అనుభవం అన్నట్లుగా అనిత ఆడవాళ్లకు సూచిస్తోంది.

అంతేకాకుండా.. ఆ కండోమ్ టెలివిజన్ కమర్షియన్ ను కూడా అనిత ఆ తరువాత అకౌంట్ లో పోస్ట్ చేసింది. తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో తారలు రకరకాల బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూనే ఉంటారు. కాఫీ పొడితో మొదలుకొని.. అన్ని రకాల వాటిని వారు పెయిడ్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అనిత నిర్మొహమాటంగా కండోమ్ ప్రమోషన్ ను చేపట్టినట్లుగా ఉంది. ఇదే కండోమ్ యాడ్ లో నటి నిధి అగర్వాల్ కూడా నటించింది.

ఆమె ప్రమోట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నిధిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదో అనుభవం ఉన్నట్లు మాట్లాడుతున్నావ్ అంటూ ఓ రేంజ్ లో ఆమెని ఆడేసుకుంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus