Actress: ఆ కారణం వల్లే ఆలాంటి సినిమా చేయాల్సి వచ్చింది స్టార్ హీరోయిన్ .!

గ్లోబల్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే .. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా కూడా కెరియర్ స్టార్టింగ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఇప్పుడంటే నిక్ జోనస్ లాంటి స్టార్ సెలబ్రెటీని పెళ్లి చేసుకుని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ వందల వేల కోట్లకి అధిపతురాలైన ప్రియాంక చోప్రా ఒకప్పుడు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది అంటూ ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది .

ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంటర్వ్యూలలో సంచలన విషయాలను బయటపెడుతున్న ప్రియాంక చోప్రా ..రీసెంట్గా ఓ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ను బయట పెట్టింది . అంతేకాదు ఇండస్ట్రీలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను అని చెప్పిన ప్రియాంక చోప్రా .. తన కెరియర్ లో కొన్ని సినిమాలు పరమ చెత్తగా ఉన్నాయని.. తెలిసిన నటించానని.. వేరే గతిలేక అలా చేశానంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

ఆ సినిమా పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రియాంక చోప్రా ” ఓ సినిమాలో మాత్రం నేను అసలు ఇష్టం లేకుండానే నటించానని .. సెట్స్ లో గంటలు గంటలు కూర్చోబెట్టి ఫైనల్లి ఏవేవో చెత్త చెత్త డైలాగ్స్ రాయి ఇచ్చే వారిని .. పనికిమాలిన సీన్స్ చేయించి ఇంటికి పంపించేవారని .. అప్పట్లో నాకు ఒళ్ళు మండిపోయిందని ..ఆయన ఇక గత్యంతరం లేక కళ్ళు మూసుకుని అలాంటి సీన్స్ చేసి బయటకు వచ్చేసానని “చెప్పుకొచ్చింది.

దీంతో సోషల్ మీడియాలో (Actress) ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా రీసెంట్గా ప్రియాంక చోప్రా సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటించి ఎంత బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిందో మనకు తెలిసిందే . దీంతో సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా పేరు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus