Star Actress: సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పిన స్టార్ హీరోయిన్

  • June 10, 2023 / 12:33 PM IST

హీరోయిన్లు తెల్లగా.. ఉంటేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. లేదంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అని అంతా నమ్ముతూ ఉంటారు. అదంతా వట్టి అపోహ మాత్రమే అని బాలీవుడ్ నటి.. కాజోల్ ఎప్పుడో నిరూపించింది. ‘ఆర్.ఆర్.ఆర్’ నటుడు అజయ్ దేవగన్ భార్యగా కూడా ఈమె అందరికీ బాగా తెలుసు. కెరీర్ ప్రారంభంలో ఈమె చర్మం నలుపుగా ఉందని విమర్శలు చేసేవారట.ఇప్పుడు ఆమె గ్లామర్ పెరిగింది. ‘అయినా ఎలాంటి ఫెయిర్నెస్ క్రీమ్ వాడట్లేదు.

స్కిన్ వైటెనింగ్ సర్జరీ కూడా చేసుకోలేదు. గతంలో 10-12 ఏళ్లు విరామం లేకుండా ఎండలో పనిచేశాను. ఇప్పుడు సూర్యుడికి ఎక్స్పోజ్ కావట్లేదు కాబట్టే ఇలా కనిపిస్తున్నాను’ అంటూ ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి ఈమె చాలా సింపుల్ గా రియాక్ట్ అయ్యింది. ఈమెను టాలీవుడ్ కు తీసుకురావాలని చాలా మంది దర్సకనిర్మతలు ట్రై చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. అందుకే తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి ఈమె కలల రాకుమారిగా మిగిలింది.

ఇదిలా ఉండగా.. కాజోల్ (Actress) ఇప్పుడు ఓ డెసిషన్ తీసుకుంది.అదేంటి అంటే కాజోల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన కొత్త ఫొటోలతో పాటు గతంలో ఆమె నటించిన సినిమాల యానివర్సరీలకి కూడా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పబోతుందట.

ఈ విషయాన్ని స్వయంగా కాజోల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే అది తాత్కాలికంగా మాత్రమే. ‘ప్రస్తుతం నేను నా జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. అందుకే కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో కాజోల్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus