Star Actress: ఇలియానాల నువ్వు కూడా పెళ్లి కాకముందే తల్లి అవుతావా ఏంటి?

ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ప్రముఖ ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికాతో గడిపిన క్షణాలను ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గత కొన్ని ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరు సహజీవనం కూడా చేశారు. అయితే ఇప్పుడు కెరియర్ పరంగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే సినిమాలు ఇతర కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్న ఈమె ప్రియుడితో సమయం కేటాయించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

కొద్ది రోజుల క్రితం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి యూరప్ వెళ్లిన ఈమె కేన్స్ 2023 వేడుకలలో రెడ్ కార్పెట్ పై నలుపు రంగు దుస్తుల్లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇకపోతే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో శృతిహాసన్ పాల్గొనడం ఇదేమి మొదటిసారి కాదు.. ఇదివరకే కూడా రకరకాల దుస్తుల్లో ప్రేక్షకులను అలరించింది. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం తాను రెడీ అయిన లుక్ ను కూడా అభిమానుల కోసం ఫోటోల రూపంలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న (Actress) శృతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతే తప్పేముంది అంటూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది. అంతే కాదు పిల్లల్ని కనేది ఆడవాళ్లే కాబట్టి ఆడవాళ్లకు పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే స్వేచ్ఛ స్వాతంత్రం కూడా ఉంటాయి. అందుకే ఆడవాళ్లు పెళ్లి కాకముందు కూడా తల్లి అవ్వవచ్చు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఇలియానాల నువ్వు కూడా పెళ్లి కాకముందే తల్లి అవుతావా ఏంటి అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus