Star Actress: వివాహేతర సంబంధాలపై నటి షాకింగ్ కామెంట్స్

  • August 21, 2024 / 06:48 PM IST

వివాహేతర సంబంధాల గురించి తరచూ పేపర్లోనూ, న్యూస్ ఛానల్స్ లోనో చూస్తూనే ఉన్నాం.సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత వీటిపై ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో ఎక్కువగా చర్చలు జరుగుతుండటం వంటివి కూడా అందరికీ తెలుసు. అయితే ఎఫైర్స్ అనగానే అందరి చూపు సినీ పరిశ్రమపైనే ఉంటుంది. ఇక్కడ డేటింగ్లు, ప్రేమ,బ్రేకప్, పెళ్ళి, విడాకులు వంటివి ఎంత కామనో.. వివాహేతర సంబంధాలు కూడా అంతే కామన్ అని కొందరు కామెంట్లు చేస్తుంటారు. వాటిలో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ..

Star Actress

ఓ నటి (Star Actress) మాత్రం ‘వివాహేతర సంబంధాల వల్ల తప్పులేదు’ అంటూ షాకింగ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే… ప్రముఖ మలయాళ నటి షీలూ అబ్రహం (Star Actress) మాట్లాడుతూ… “వివాహేతర సంబంధాలకు పాల్పడే వారిని ఎప్పుడూ నిందించకూడదు.వైవాహిక జీవితంలో ఏదైనా లోటు పాట్లు వంటివి చోటు చేసుకుంటే ఎఫైర్స్ వంటివి మొదలవుతాయి. అలాంటి బంధాన్ని తప్పని అనడానికి కూడా అందరికీ హక్కు లేదు. వ్యక్తిగత స్వేచ్ఛని మనం గౌరవించాలి. సోషల్ మీడియాలో చర్చలకు పాల్పడి మనం దానికి భంగం కలిగించకూడదు.

అత్యాచారం కూడా చాలా తప్పు. ఏకాభిప్రాయంతో శరీరాలను కలుపుకోవడంలో తప్పు లేదు. అలాగే ఇష్టంగా ఏకమై చివరికి దాన్ని రేప్ అని ఆరోపణలు చేయడం మాత్రం చాలా తప్పు. సినీ పరిశ్రమలో ఎఫైర్స్ గురించి జనాలకి కూడా ఒక ఐడియా ఉంది. ‘పుకార్లు ఊరికే రావు’ అంటూ వాళ్ళు కూడా కొన్ని గాసిప్స్ ని బట్టి అర్థం చేసుకుంటున్నారు. సో వాళ్లకి తెలియంది అంటూ కూడా ఇక్కడ ఏమీ లేదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది .

మొత్తానికి ఓపెన్ అయిన హేమ..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus