రాఖీ సావంత్.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..! ‘మీటూ’ టైములో తను శ్రీ దత్తా తో పాటు రాఖీ సావంత్ పేరు కూడా ఎక్కువగా వినిపించేది. ఆమెకు వ్యతిరేకంగా ఈమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ ఏడాది ప్రేమికుల రోజు నాడు తన భర్తతో తెగదెంపులు చేసుకుని ఈమె హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
కొంతకాలంగా ఆమె … అదిల్ దురానీ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. కొద్ది నెలలుగా సహజీవనం కూడా చేస్తుంది.ఈ క్రమంలో రాఖీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ పై అదిల్ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసిందట.రాఖీ పద్ధతి మార్చుకుంటే మంచిది అని సూచించారట అతని ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ మాటకి ఈమె విలువిచ్చి… వారు చెప్పినట్టే చేస్తుందట. అప్పటి నుండీ ఈమె చాలా మారినట్టు సమాచారం. అయితే అదిల్… రాఖీని పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది విమరిస్తున్నారట.
అతని ఇంట్లో పెళ్లీడుకొచ్చిన చెల్లెలు ఉంది అన్న విషయాన్ని మర్చిపోయాడా అంటూ కామెంట్లు చేస్తున్నారట. ఈ విషయాల పై రాఖీ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “బాలీవుడ్‌లో చాలా మంది ముస్లింలు ఉన్నారు. వాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదా? ఆ అమ్మాయిలు ఎక్స్‌పోజ్ చేయడం లేదా? ఐటం సాంగ్స్‌లో ఆడిపాడటం లేదా? నేను అదిల్‌ను పెళ్లి చేసుకుంటే అతని కుటుంబంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందా? అనవసరంగా ఏదేదో వాగుతున్నారు.
అదిల్ నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అతడి చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏంటీ చెత్త వాగుడు? నేనేమైనా ఉగ్రవాదినా? నేను పెళ్లి చేసుకోకూడదా? నా వల్ల ఆమెకు సంబంధాలు ఎందుకు చెడిపోతాయి? ఏదేమైనా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారన్న మాట గుర్తు పెట్టుకుంటే అందరికీ మంచిది’ అంటూ మండిపడింది రాఖీ.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!