2001 లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భలే వాడివి బాసూ’ అనే సినిమా రూపొందింది. ‘తమ్ముడు’ వంటి సూపర్ హిట్ ను అందించిన అరుణ్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘నరసింహ నాయుడు’ తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా డిస్కషన్ ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు.
ఈ సినిమాలో విచిత్ర అనే నటి నటించింది. తాజాగా ఆమె ఈ సినిమా షూటింగ్ విషయాల గురించి చెబుతూ బాలయ్య పై చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి అని చెప్పాలి. ఆమె తమిళ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఓ టాస్క్ లో భాగంగా ఆమె ‘భలే వాడివి బాసూ’ సినిమా షూటింగ్ అనుభవాల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది.
విచిత్ర మాట్లాడుతూ.. “2001లో ఓ సినిమా(భలే వాడివి బాసూ) షూటింగ్లో పాల్గొన్నాను. ఇందులో భాగంగా కేరళ దగ్గర అవుట్ డోర్ లో షూటింగ్ పార్ట్ ను నిర్వహించారు. 3 స్టార్ హోటల్లో మాకు రూమ్ ఇచ్చారు. షూటింగ్ అయిన తరువాత పార్టీ జరిగింది. అక్కడికి వెళితే… ఆ సినిమాలోని మెయిన్ హీరో నన్ను కలిశాడు. ఆ తర్వాత అతను కనీసం నా పేరు కూడా అడగకుండా నేరుగా ‘రాత్రికి నా రూమ్ కి వచ్చేయి’ ‘Come to my room’ అంటూ అనేశాడు.
కానీ నేను అతని రూమ్ కి పోకుండా, నేరుగా నా రూమ్ కి వెళ్ళి పడుకున్నాను. నేను వెళ్లకపోవడంతో ఆ అగ్ర హీరో రోజూ నన్ను వేధించేవాడు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె హీరో పేరు చెప్పినప్పటికీ తర్వాత ఆ వీడియోని మ్యూట్ చేశారని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ పై కూడా నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇలాంటి విషయాలను (Balakrishna) బాలయ్య ‘బ్రో ఐ డోంట్ కేర్’ అన్నట్టు లైట్ తీసుకుంటాడు అనే సంగతి వారికి తెలీదు అనుకుంట.
https://twitter.com/JohnWick_fb/status/1727048798449565991
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!