Shah Rukh Khan: షారుక్ అందంపై నటి షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయనకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక షారుక్ ఖాన్ నటనకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి షారుఖ్ ఖాన్ గురించి పాకిస్తాన్ నటి మహానూర్ బలోచ్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీంతో షారుక్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆమెపై మండిపడుతున్నారు. షారుక్ ఖాన్ పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక ఈ సినిమా అనంతరం షారుఖ్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో నటి మహానూర్ షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతూ..

షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పెద్ద అందగాడు ఏమీ కాదని ఆయనకు నటన కూడా పెద్దగా ఏమీ రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఒక గొప్ప బిజినెస్మేన్ అని తెలియజేశారు. తనని తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో షారుక్ ఖాన్ కి చాలా బాగా తెలుసు అంటూ ఈమె కామెంట్ చేశారు.ఈ విధంగా షారుఖ్ ఖాన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో షారుక్ ఖాన్ అభిమానులు సదురు నటి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మరే కారణాలు లేవని ఒక స్టార్ హీరో గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తనకు పబ్లిసిటీ వస్తుందన్న కారణంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో షారుక్ ఖాన్ అభిమానులు మండిపడుతున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus