క్యాస్టింగ్ కౌచ్ గురించి నటీమణులు చాలా సందర్భాల్లో ఎన్నో రకాలుగా చెబుతూ వచ్చారు. కానీ ఎవ్వరూ కూడా క్లారిటీగా చెప్పిన ఫీలింగ్ కలగలేదు. ఆఫర్లు ఉన్న వాళ్ళు ఒకలా.. ఆఫర్లు లేని వాళ్ళు ఇంకోలా చెబుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ గా నిలిచాయి. ఒకప్పుడు తన అందంతో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ హేమా మాలిని క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పాండవ వనవాసం, శ్రీకృష్ణ విజయం, గౌతమీపుత్ర శాతకర్ణి, వంటి చిత్రాలతో ఈమె తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరైంది. ఆమె ఈ విషయం పై స్పందిస్తూ… ‘ ఓ డైరెక్టర్ నన్ను.. నా చీరకి ఉన్న పిన్ తీసేయమని అన్నాడు. అప్పుడు నేను షాక్ కి గురయ్యాను. సినిమాలో బోల్డ్ సీన్ కోసం లుక్ టెస్ట్ చేయడానికేమో అని అనుకున్నాను. నా చీరకి నేను పిన్ పెట్టుకుంటాను. అది తీస్తే నా చీర జారిపోతుంది అన్నాను.
అప్పుడు అతను నాకు (Actress) కావాల్సింది కూడా అదే అన్నాడు. కొద్దిసేపు నా మైండ్ పనిచేయలేదు. కానీ ఆ ప్రాజెక్టుకి సైన్ చేయడం వల్ల నాకు తప్పలేదు. అతను చెప్పినట్టే చేశాను.ఆ టైంలో నాకు చాలా ఏడుపొచ్చింది. ‘ అంటూ చెప్పుకొచ్చింది హేమా మాలిని. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ దర్శకుడు ఎవరు అనే విషయాన్ని ఈమె రివీల్ చేయలేదు.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!