సీక్రెట్ గా పెళ్లి చేసుకుని… నెల దాటాక రివీల్ చేసింది!

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ అందరికీ సుపరిచితమే.తన ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే సైలెంట్ గా ఈమె పెళ్లి చేసుకుని పెద్ద షాక్ ఇచ్చింది. అవును ఈమె ఓ పొలిటీషియన్ ను పెళ్లి చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. స్వర భాస్కర్.. తన స్నేహితుడు, ప్రియుడు అయిన అహ్మద్ ఫహద్ ని పెళ్లాడింది. ఈమె పెళ్లి వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కాదు కాదు ఈ విషయాన్ని స్వర భాస్కర్ వెల్లడించింది. జనవరి 6న ఈమె జరిగినట్టు వెల్లడించింది. ఈ క్రమంలో తన భర్తతో తీసుకున్న ఓ షార్ట్ వీడియోని షేర్ చేసింది.

వీళ్ళ పరిచయం దగ్గరనుండి పెళ్లి వరకు ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ తో ఈ షార్ట్ వీడియో ఉంది. అహ్మద్ ఫహద్.. నవ సమాజ్ పార్టీ లీడర్, అలాగే రాజకీయ కార్యకర్త. జనవరి 6న స్వర భాస్కర్ – అహ్మద్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన స్వర భాస్కర్ ‘ప్రేమను వెతుకుతున్న సమయంలో స్నేహం పరిచయం రూపంలో లభిస్తుంది.

తర్వాత అది పెళ్ళితో ఎండ్ అవుతుంది. నా జర్నీలో ఫైనల్ గా నా ప్రేమ నాకు దొరికింది. వెల్కమ్ టు మై లైఫ్ మై లవ్’ అనే అర్థం వచ్చేలా ఈమె తన మనసులోని భావాన్ని కూడా తెలిపింది. ఇక ఈ నూతన దంపతులకు నెటిజన్లు ఆల్ ది బెస్ట్, కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus