జీవితంలో ఎంతమందిని ప్రేమించినా, ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా కూడా ఫస్ట్ లవ్ గురించి మాత్రం ఎవరూ మర్చిపోరు. ఆ ఫస్ట్ లవ్ అనేది టీనేజ్లో కలిగితే ఇంకా అసలు మర్చిపోరు. ఎందుకంటే ఆ ఏజ్ లో మైండ్ లో ఎలాంటి స్వార్థం, డబ్బు, పలుకుబడి, కన్వీనెంట్, ఒకరితో ఒకరికి పడుతుందా లేదా, గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటామా లేదా.. ఇవన్నీ ఆలోచించకుండా కేవలం వయసు రాగానే.. మనసు కోరుకునే ప్రేమతో.. ఎదుటి వాళ్ళకు అట్రాక్ట్ అయ్యి ప్రేమించుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి ఇష్టాన్ని మన హీరోయిన్స్ ఎవరిని లవ్ చేసి.. గుర్తు చేసుకుంటున్నారో చూద్దాం..
శృతిహాసన్
శృతిహాసన్ స్కూల్ వయసులోనే 15 ఏళ్ల ప్రాయంలో ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడి ప్రేమించిందంట. ఈ విషయం శృతిహాసన్ స్వయంగా ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సిద్ధార్థ్, ధనస్సు, మైఖేల్ కోర్సులే వాళ్లతో లవ్ లో పడటం విడిపోవడం కూడా జరిగిపోయింది.
కియారా అద్వానీ
ఈమె కూడా టీనేజ్ లోనే ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఇంటర్ చదివే సమయంలో కాలేజీలో క్లాస్మేట్ ని ప్రేమించిందట. అది తెలిసిన ఇంట్లో వాళ్ళు ఆమెను అతన్ని ప్రేమించడానికి వీలులేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. అయినా కూడా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఏదో ఒక సాకుతో బయటకు వెళ్లి అతన్ని కలిసి వచ్చేదంట. ఇక కెరియర్ లోకి వచ్చి జీవితం సాగుతూ ఉండగా.. సిద్ధార్థ మల్హోత్రాలతో పెళ్లి జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే.
అలాగే (Actress) నిధి అగర్వాల్, తాప్సి ఇద్దరు హీరోయిన్స్ కూడా టీనేజ్లో ప్రేమలో పడ్డామని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా టీనేజీ లవ్ అనేది ఇష్టం లేని వాళ్లంటూ సాధారణముగా ఎవ్వరో గాని ఉండరు. టీనేజీలో సరదాగా ప్రేమించుకోవచ్చు గాని.. పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే మాత్రం తీసేసుకోకూడదు. ఎందుకంటే అది బాధ్యత ఎరుగని వయసు కాబట్టి..
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!