సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి మృతి

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. రచయిత యడ్లవల్లి మరణించి 2 రోజులైనా కాకుండానే మరో రచయిత కన్నుమూయడం అందరికీ షాకిచ్చే అంశం. ఇక వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి, రచయిత అయిన లలిత లాజ్మీ మరణించడం జరిగింది. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈమె సినీ బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దదే అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.

ఒకప్పటి బాలీవుడ్ హీరో గురుదత్ కు ఈమె సోదరి. సోదరుడి రిఫరెన్స్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి… ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసారు. అలాగే ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో మంచి మంచి పాత్రలు పోషించి మెప్పించారు ఈమె. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తారే జమీన్ పర్’ చిత్రంలో ఈమె అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఆమె ఆర్ట్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. ఈమె మరణ వార్త పై జహంగీర్ నికల్సన్ ఆర్ట్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో స్పందించి తమ సానుభూతి తెలపడం జరిగింది.

లలిత ఓ పెయింటర్..అలాగే తనకు తానుగా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న గొప్ప వ్యక్తి కూడా..! ఈమె తన పర్సనల్ లైఫ్ సంఘటనలను ఆధారం చేసుకుని ఎన్నో రచనలు చేశారు. వాటికి మంచి స్పందన లభించింది. ఈమె మరణ వార్త విని బాలీవుడ్ సెలబ్రిటీలు షాక్ కు గురవుతున్నారు. ఆమె మరణానికి చింతిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus