పాపులర్ యాంకర్ కి తిప్పలు తప్పవా..?

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ అందాల యాంకర్, ఎన్టీఆర్ అనుశ్రీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. మంగుళూరు సీసీబీ పోలీసులు కోర్టుకి సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఆమె పేరుని పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ లో శాండల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ బయటపడగా.. అప్పట్లో అధికారులు అనుశ్రీను విచారించారు. ముఖ్య సమాచారాన్ని ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. అనుశ్రీ డ్రగ్స్ ను అమ్మడంతో పాటు రూమ్ కు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిషోర్ అమన్ శెట్టి చెప్పినట్లు తెలిపారు.

తరుణ్, అనుశ్రీలు డ్రగ్స్ పార్టీలకు వెళ్లడంతో పాటు రూమ్ కు డ్రగ్స్ ను తీసుకొచ్చేవారని.. అను బెంగుళూరులో డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో డ్రగ్స్ సేవిస్తే ఖుషీగా డాన్స్ చేయొచ్చని తోటివారితో చెప్పేదని.. విచారణలో అమన్ శెట్టి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అమన్ తానెప్పుడూ అలా చెప్పలేదని తాజాగా ప్రకటించాడు. బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ అనుశ్రీతో తనకు పరిచయం లేదని.. 2009లో భారత్ కన్నడ డాన్స్ షోలో ఆమెని కలిశానని.. ఆ తరువాత ఎప్పుడూ కలవలేదని అన్నారు. ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన ఆరోపణలను ఖండించారు. అనుశ్రీపై ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

గతంలో అనుశ్రీ ఈ డ్రగ్ కేసుకి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తను బెంగుళూరుకి 14 ఏళ్ల క్రితం బస్సులో వచ్చానని.. పన్నెండేళ్ల పాటు హాస్టల్ లో ఉన్నానని.. ఆ తరువాత నాటక రంగంలో ఆఫర్లు వచ్చాయని.. మంచిగా ఉండడం వలనే ఇండస్ట్రీలో ఎదగగలిగానని.. అయితే డ్రగ్స్ కేసులో విచారించడం బాధకు గురి చేసిందని అన్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus