Jr NTR: ఆ దర్శకుడు ఎన్టీఆర్ ఎవరని అన్నడట!

Ad not loaded.

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తో మొత్తానికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నుంచి కూడా అతనికి ఇప్పుడు ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయి. అగ్ర నిర్మాతలు దర్శకులు కూడా ఎన్టీఆర్ డేట్స్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి నందమూరి వారసత్వాన్ని పాన్ ఇండియా వరకు తీసుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు కెరీర్ విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాడు.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్ తోనే ఎక్కువగా అవకాశాలు అందుకున్నాడు అని చెప్పవచ్చు.అయితే ఎన్టీఆర్ ను ఒకప్పుడు ఒక స్టార్ దర్శకుడు ఎవరో తెలియదు అన్నట్లే మాట్లాడిన విధానం అప్పట్లో అభిమానులను చాలా ఆగ్రహానికి గురిచేసింది. సింహాద్రి యమదొంగ వంటి విషయాల అనంతరం జూనియర్ ఎన్టీఆర్ పేరు సౌత్ ఇండస్ట్రీ లో ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అయితే తమిళంలో ఒక పేరున్న మాస్ డైరెక్టర్ హరి అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే అదే విషయాన్ని డైరెక్టర్ హరిని మీడియా తరచూ అడిగే ప్రయత్నం చేసింది. దీంతో అతను ఎన్టీఆర్ ఎవరు అని ఒకే ఒక్క ప్రశ్న తో ఆ కథనాలకు ముగింపు కార్డు పెట్టాడట. డైరెక్టర్ హరి కావాలనే సెటైరికల్ గా అలా కామెంట్ చేసినట్టు అప్పట్లో అభిమానులు కూడా చాలా హార్ట్ అయ్యారు. అయితే హరి ఇప్పుడు అంతగా ఫామ్ లో అయితే లేడు. ఇక అతను ఇప్పుడు తెలుగు హీరోల పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం మాస్ హీరో గోపీచంద్ తో కూడా సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమిళంలో సింగం సిరీస్ లతో మంచి గుర్తింపు అందుకున్న హరి ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి రావాలి అని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి వీరి కలయికలో వచ్చే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus