ఒకప్పుడు యాంకర్ గా తన సత్తా చాటిన ఉదయభాను.. పలు రకాల షోలతో ఎంతో బిజీగా గడిపేది. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కూడా కనిపించేది. ‘లీడర్’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి షాకిచ్చింది. అయితే అందరిలానే అప్పట్లో ఉదయభానుపై కూడా కొన్ని రూమర్లు షికారు చేశాయి. ఓ దర్శకుడితో ఆమె ఎఫైర్ సాగిస్తోందంటూ కథనాలు ప్రచురించారు. అయితే ఉదయభాను ఆ వార్తలపై పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇక పెళ్లి తరువాత ఆమె ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ రూమర్లపై సదరు దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
‘ఆహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన వీరభద్రం చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉదయభానుతో ఉన్న ఎఫైర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన.. ”ఎవరైనా సరే పండ్లున్న చెట్లపైనే రాళ్లు వేస్తారు. అప్పట్లో నాకు వరుసగా రెండు హిట్లు రావడంతో కావాలనే నాపై అలాంటి రూమర్స్ క్రియేట్ చేశారు. నిజానికి నేను ఉదయభానుని ఎప్పుడూ కలవలేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు. టీవీలో ఆమెని చూడడం తప్పితే.. పర్సనల్ గా ఎప్పుడూ మీట్ అవ్వలేదని.. అలాంటిది ఆమెతో ఎఫైర్ అనే వార్తలు ఎలా స్ప్రెడ్ చేశారో ఇప్పటికీ అర్ధం కాదని అన్నారు.
దర్శకుడిగా బిజీగా ఉండడం వలన అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఈవీవీ సత్యనారాయణ, తేజ లాంటి దర్శకుల వద్ద పని చేసిన వీరభద్రం చౌదరి.. కెరీర్ ఆరంభంలో రెండు హిట్స్ అందుకున్నా.. ఆ తరువాత నాగార్జునతో ‘భాయ్’ అనే సినిమా తీసి డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడికి సరైన అవకాశాలు రాక.. చిన్నాచితకా సినిమాలు తీస్తూ కాలం గడుపుతున్నాడు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!