బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే రెండు వివాహాలు చేసుకుని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఐరా ఖాన్ జన్మించారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన తల్లిదండ్రుల విడాకులు తీసుకొని విడిపోయిన సంఘటన గురించి చెబుతూ పలు విషయాలు వెల్లడించారు.
అమ్మ నాన్న ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోవాలి అనుకున్న సమయంలో తాను ఇండియాలో లేనని తెలిపారు.ఇక వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అన్న విషయం తెలిసి వెంటనే తాను ఇండియాకి వచ్చానని అయితే వారితో స్నేహపూర్వకంగా విడాకులు తీసుకోబోతున్నామని చెప్పడంతో నన్ను మానసికంగా ఎంతో బాధ పెట్టిందని ఐరా ఖాన్ వెల్లడించారు. వారిద్దరూ స్నేహపూర్వకంగా విడిపోతున్నామని చెప్పిన ఆ బాధ నన్ను వెంటాడిందని తెలిపారు.
ఈ విధంగా అమ్మ నాన్న విడాకులు తీసుకున్నారన్న వార్త నన్ను చాలా బాధపెట్టాయి. ఈ బాధతో తాను నాలుగు రోజులపాటు భోజనం కూడా చేయలేదని రోజులు ఎనిమిది గంటల పాటు ఏడుస్తూ 10 గంటల పాటు నిద్రపోతూ ఉండే దానిని ఇలా ఏడాదిన్నర పాటు ఇలాగే గడిపాను. నేను ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. ఇక ఈ విషయం చెపుతూ ఎవరిని బాధ పెట్ట దలుచుకోలేదని ఈమె తెలిపారు.
అమీర్ ఖాన్ (Star Hero) రీనా దత్తాకి విడాకులు ఇచ్చిన తర్వాత అనంతరం కిరణ్ రావు అనే ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే ఈ దంపతులకు ఒక బాబు జన్మించిన తర్వాత అమీర్ ఖాన్ తనకి కూడా విడాకులు ఇచ్చారు. ఇలా అమీర్ ఖాన్ రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు.ఇద్దరి భార్యలతో విడాకులు తీసుకున్నప్పటికీ ఈయన ఇద్దరితో కలిసి చాలా స్నేహపూర్వకంగానే ఉంటారు ఇప్పటికీ పలు సందర్భాలలో వీరంతా కలుస్తూనే ఉంటారు.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!