స్టార్ హీరో సంచలన కామెంట్లు.. అందుకే సినిమాలకు దూరమయ్యాడట..!

సినిమా ఇండస్ట్రీలో క్లిక్ అయితే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని కొంతమంది అంటుంటారు. అయితే ఒకానొక టైములో కింగ్ లా ఏలిన ఎంతో మంది చివరి రోజుల్లో అప్పులు పాలైన వారు కూడా లేకపోలేదు. ఇంకొంత మంది అయితే ధైర్యం చాలక ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే.. 1990 లలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు గోవింద. అతని డ్యాన్స్ లు చాలా ఎనర్జిటిక్ గా ఉండేవి. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా గోవింద.. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ అని కితాబిచ్చాడు అంటే అతని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే గత కొంత కాలంగా గోవింద బుల్లితెరకు మాత్రమే పరిమితమయ్యాడు.

కొంతమంది తనను మోసం చెయ్యడం వల్లనే.. ఈరోజు ఇలా అయిపోయినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసాడు గోవింద. అతను మాట్లాడుతూ.. “ఆర్థికంగా నేను బాగా సెటిలైన టైములో కొంతమంది నా పై కుట్ర చేశారు. దాంతో నేను అప్పుల పాలైపోయాను.సరిగ్గా అదే టైములో నేను చెయ్యాల్సిన చాలా సినిమాల నుండీ నన్ను తొలగించేలా చేశారు.మొదట్లో నాతో సినిమాలు చేసిన వారు కూడా నన్ను దూరం పెట్టడానికి కారణం..

అప్పుడు నా పక్కన ఉన్న వారే..! ఆ విషయం నేను తొందరగా గ్రహించలేకపోయాను. పలు వ్యాపారాల్లో నాతో కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టించి నేను నష్టపోయేలా చేశారు. ఆ రోజుల్లోనే నేను 16కోట్ల వరకూ నష్టపోయాను. ఇక మళ్ళీ నేను సినిమాల్లో బిజీ అవ్వాలని ట్రై చేస్తున్నాను. మంచి పాత్రలు దొరికితే ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి నేను రెడీగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు గోచింద.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus