Actress: ఇప్పుడు ఆమె పేరు చెబితేనే పరుగులు..కారణం అదేనా?

గోవా బ్యూటీ ఇలియానా తెలుగు చిత్ర పరిశ్రమలో తన మొదట నటించిన చిత్రం దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అలా తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు లభిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక మనందరికీ తెలిసిందే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత హిట్టు కొట్టాక.. స్టార్ హీరోయిన్ గా ముద్రపడ్డాక.. ఆ తర్వాత ఎంతో ఓపికతో, సహనంతో ఉంటూ మరింత ఎత్తుకు ఎదగాలని పట్టుదల ఉండాలి కానీ.. నేను స్టార్ హీరోయిన్ గా మారిపోయానని తోక జాడించిన..

అతి తెలివి ప్రదర్శించిన.. సీన్ రివర్స్ అయిపోద్ది అది అందరికీ తెలిసిన విషయమే.. మరి అలాంటి పరిస్థితి ఏరి కోరి తెచ్చుకుంది గోవా బ్యూటీ అందాల ముద్దుగుమ్మ ఇలియానా.. ఈమె నటించిన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇక ఆ తర్వాత స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అందుకుంటూ సూపర్ హిట్లు పొందుకుంటూ సూపర్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే బడా హీరోయిన్ లిస్టులోకి వెళ్లిపోయింది (Actress) ఇలియానా..

తెలుగులో ఎంతో మంచి పేరు సంపాదించుకొని ఈ పాపులర్ కారణంతోనే బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడంతో బాలీవుడ్ బాట పట్టి లక్కు ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీని పూర్తిగా వదిలేసి.. కేవలం బాలీవుడ్ లోనే తైతక్కలాడుతూ స్టెప్పులేసింది ఇలియానా.. ఇదే కారణం చేత బాలీవుడ్లో ఎందరో జనాలు ఈమెను ఫెడవుట్ హీరోయిన్ గా ముద్ర వేశారు. మొదట్లో బాలీవుడ్లో ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గిపోవడంతో ఇటు తెలుగులో రాలేక అటు బాలీవుడ్లో ఆఫర్లు రాలేక మధ్యలో నలిగిపోయింది ఇలియానా..

టాలీవుడ్ లో ఇంత మంచి పేరు సంపాదించుకున్న ఇలియానాకు టాలీవుడ్ లో ఉండే ఫేవరెట్ హీరోలు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఎందుకంటే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నప్పుడు తెలుగులో ఎన్నో అవకాశాలు లభించినప్పటికీ.. వాటన్నిటిని రిజెక్ట్ చేసిందని కారణంతోనే ఆ తర్వాత స్టార్ హీరోలు సైతం ఆమెను దూరం పెట్టేశారు. దాంతో అప్పట్లో ఆమె చేసిన ఆ తప్పే ఇప్పుడు ఆమెకు ముప్పుగా మారిందన్న న్యూస్ మరోసారి వైరల్ గా మారింది.

ఒకవేళ బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్నప్పటికీ ఇటు తెలుగు ప్రేక్షకులని మర్చిపోకుండా టాలీవుడ్ లోనే కొనసాగి ఉంటే ప్రస్తుతం ఇలియానా క్రేజ్ వేరే లెవెల్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఇలియానా ఎవరు పట్టించుకోవడం లేదు ఏ ఒక్క తెలుగు హీరో కూడా దగ్గరికి రావాలంటే భయపడుతున్నాడని వార్త వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఇలియానా పరిస్థితి విషయానికి వస్తే ఇలియానా గర్భవతి.. ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా బేబీ ఫోటోలు షేర్ చేస్తూ హ్యాపీగా ప్రెగ్నెన్సీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ కొనసాగిస్తుంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus