”బాలీవుడ్ మాఫియా నన్ను చంపాలని చూస్తుంది”

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని గతంలో ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది నటి తనుశ్రీ దత్తా. అలానే కొందరు బాలీవుడ్ ప్రముఖులపై ఆమె ఘాటు కామెంట్స్ చేసింది. తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో బాలీవుడ్ మీడియా తన చావు కోసం చూస్తోందంటూ సంచలన కామెంట్స్ చేసింది. తనను టార్గెట్ చేసి.. వేధిస్తున్నారని చెప్పింది. మొదటి నుంచి కూడా బాలీవుడ్ లో పని దక్కకుండా చేశారని..

ఆ తరువాత పనిమనిషి ద్వారా విషప్రయోగం కూడా చేశారని పేర్కొంది. ఉజ్జయిని వెళ్తుండగా.. తన కారుకి యాక్సిడెంట్ చేయించారని.. చావు తప్పించుకొని ముంబైలో అడుగుపెడితే తన ఇంటి ముందు గొడవ చేస్తున్నారని.. ఎంత వేధించినా తను మాత్రం చావనని చెప్పుకొచ్చింది. ఇక్కడ(బాలీవుడ్) నుంచి వెళ్లే ప్రసక్తే లేదని.. పోరాడుతూనే ఉంటానని.. బాలీవుడ్ మాఫియాను వదిలే ఛాన్స్ లేదని తెలిపింది. కొన్ని రాజకీయ శక్తులు, బాలీవుడ్ మాఫియా కలిసి తన పతనం కోసం ప్రయత్నిస్తున్నాయని.. ఇక్కడి పరిస్థితులు అసలు బాలేవని.. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇక్కడ యంత్రాంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ విషయంలో కొందరు తనుశ్రీని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమె ఎటెన్షన్ కోసం ఇదంతా చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొందరు ఉన్నారని.. ఆమెని రాజకీయంగా వాడుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్లే ఆమె రాసిన పోస్ట్ లో కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో పాలించాలని పేర్కొంది. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు సంబంధించిన తన సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూనే ఉంది ఈ బ్యూటీ.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus