సీత పాత్రని, జెన్నీ పాత్రని మిస్ చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?

రాజమౌళి తెరకెక్కించిన ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే పలు బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం రెండో వీకెండ్ కూడా భారీగా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా చేసిన చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. సీత పాత్రలో ఆమె కనిపించింది.

Click Here To Watch NOW

ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. సినిమా ఎండ్ కార్డు టైటిల్స్ లో వచ్చే పాటలో హుషారుగా స్టెప్పులేసి సందడి చేసింది. ఇక కొమరం భీమ్ గా చేసిన ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ పాత్ర పోషించింది. ఈమె పాత్ర పేరు జెన్నీఫర్. ఈమె పాత్రకే కొంచెం ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది పైగా ఈమె లుక్స్ కూడా బాగున్నాయి.కాకపోతే హీరోలకంటే ఈమె ఎక్కువ పొడవుగా కనిపించింది. ఇదిలా ఉండగా..

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో హీరోయిన్లుగా మొదట ఈ భామల్ని అనుకోలేదు. సీత పాత్ర కోసం మొదట ‘సాహో’ బ్యూటీ శ్రద్దా కపూర్ ను అనుకున్నాడు రాజమౌళి. కానీ ఆ టైంకి ఆమె వరుస ప్రాజెక్టులకు కమిట్ అవ్వడం, అందులో ‘సాహో’ కూడా ఉండడంతో ఆమె ఈ ప్రాజెక్టుకి ఓకె చెప్పలేదు. దాంతో ఆలియా భట్ ను ఫైనల్ చేసారు. ఇక జెన్నీ పాత్ర కోసం మొదట డైసీ ఎడ్గర్ జోన్స్ అనే మరో ఇంగ్లీష్ అమ్మాయిని ఎంపిక చేసుకోబోతున్నట్లు జక్కన్న అధికారికంగా ప్రకటించాడు.

కానీ కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది. వాళ్ళు కనుక చేసి ఉంటే.. ఈ పాత్రలు ఎలా ఉండేవో..!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus