కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ కమెడియన్ గా యోగిబాబుకు గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. యోగిబాబు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. సాధారణంగా యోగిబాబు వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే తాజాగా ఈ కమెడియన్ ఒక వివాదంలో చిక్కుకోవడం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ప్రముఖ నిర్మాత గిన్నీస్ కుమార్ హాస్య నటుడు యోగిబాబుపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.
యోగిబాబుతో తాను దాదా అనే సినిమాను నిర్మించానని అయితే యోగిబాబు ఈ సినిమాలో నటించినా ఈ సినిమా ప్రమోషన్స్ కు హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నాడని మరి కొందరు వెల్లడిస్తున్నారు. యోగిబాబు నితిన్ సత్య ప్రధాన పాత్రల్లో దాదా మూవీ తెరకెక్కగా గిన్నీస్ కుమార్ ఈ సినిమాకు నిర్మాత కావడంతో దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు కథ, మాటలు అందించింది కూడా గిన్నీస్ కుమార్ కావడం గమనార్హం.
తాజాగా దాదా మూవీకి సంబంధించిన ఈవెంట్లు జరగగా ఈ ఈవెంట్లకు యోగిబాబు హాజరు కాలేదు. ఎంతో మేలు చేసినా యోగిబాబుకు విశ్వాసం లేదని గిన్నీస్ కుమార్ కామెంట్లు చేశారు. ఈ సినిమా రైట్స్ కొనుక్కోవద్దని యోగిబాబు ఫోన్లు చేస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. నా బ్యానర్ లో మరో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుని ఇప్పుడు యాక్ట్ చేయడం లేదని గిన్నీస్ కుమార్ కామెంట్లు చేశారు.
యోగిబాబు మరో మూవీలో నటించకుండా చర్యలు తీసుకోవాలని గిన్నీశ్ కుమార్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు హాట్ టాపిక్ అవుతోంది. అయితే గిన్నీస్ కుమార్ ఆరోపణల గురించి యొగిబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. యోగిబాబు ఈ విధంగా చేశారని తెలిసి ఆయన ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!