డిఫరెంట్‌ సాంగ్స్‌తో అలరించి.. ఇప్పుడు మనల్ని విడిచి!

కోలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయకుడు బంబా బకియా (49) కన్నుమూశారు. శుక్రవారం వేకువజామును ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల ఆయన ప్రాణం విడిచారని చెబుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అదనపు సమాచారం లేదు.

బంబా బకియా.. తన వైవిధ్యమైన గొంతుతో ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఆలపించారు. రజనీకాంత్‌ ‘2.0’లో ‘పుల్లింగల్‌..’ పాట కానీ, ‘డింగు డాంగు..’ అంటూ ‘సర్వమ్‌ తాళ మాయం’లోని పాట అదిరిపోతాయి. విజయ్‌ ‘సర్కారు’లో ‘సిమ్తానాగారన్‌..’ అంటూ బంబా పాడిన పాట సూపరో సూపర్‌ అంటూ ఫ్యాన్స్‌ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ‘బిగిల్‌’లో ‘కాలమే..’ పాటను మరచిపోవడం అంత ఈజీ కాదు.

రీసెంట్‌గా ఆయన నుండి వచ్చిన పాట అంటే ‘పొన్నియిన్‌ సెల్వన్‌ – 1’లోని ‘పొన్ని నాది..’ పాటనే. వీటితోపాటు ఆయన మరికొన్ని సినిమాల్లో కూడా పాటలు పాడి అలరిచంఆరు. బంబా బకియా మృతికి కోలీవుడ్‌ సెలబ్రిటీలు, మ్యూజిక్‌ లవర్స్‌, అతని అభిమానులు సంతాపం ప్రకటించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనను, ఆయన పాటల్ని గుర్తు చేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus