క్రేజీ ఆఫర్ కొట్టేసిన మురుగదాస్..!

  • December 2, 2020 / 03:34 PM IST

సౌత్ ఇండియాలో ఉన్న అగ్ర దర్శకుల్లో దర్శకుడు మురుగదాస్ ఒకరని చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన డైరెక్టర్ చేసిన ‘స్పైడర్’, ‘సర్కార్’, ‘దర్బార్’ లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ప్రేక్షకుల్లో ఆయన సినిమాలపై కాస్త ఆసక్తి తగ్గింది. మురుగదాస్ పై ఎంతో నమ్మకమున్న హీరో విజయ్ కూడా అతడికి హ్యాండ్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘తుపాకీ’, ‘కత్తి’, ‘సర్కార్’ లాంటి సినిమాలు వచ్చాయి. మరో సినిమా కూడా రావాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

స్క్రిప్ట్ విషయంలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే వరుస ఫెయిల్యూర్ లతో పాటు ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం మురుగదాస్ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మురుగదాస్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఫాక్స్ స్టార్ సంస్థతో మురుగదాస్ కి మంచి సంబంధాలున్నాయి.

ఈ సంస్థ ఇండియా విభాగం మురుగదాస్ తో కలిసి గతంలో సినిమాలు చేసింది. ఇప్పుడు అదే సంస్థ నిర్మాణంలో మురుగదాస్ హాలీవుడ్ సినిమా తీయబోతున్నాడట. ఈ సినిమా లైవ్ యాక్షన్ యానిమేటెడ్ తరహాలో ఉంటుందట. నిజానికి ఈ జోనర్ లో మురుగదాస్ సినిమాలు తీయలేదు. అనుభవం కూడా తక్కువ. కానీ ప్రాజెక్ట్ పై కసరత్తు చేసి సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో మురుగదాస్ కి ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus