హోటల్లో పట్టుబడిన టీవీ నటి, నిర్మాత లాక్ డౌన్ లో రేవ్ పార్టీ.. పోలీసులకు చిక్కిన బడా నిర్మాత

ఆయనో పెద్ద నిర్మాత, సినిమాలు తీయడం కంటే పార్టీలకు అటెండ్ అవ్వడం మీదే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసి కాంటాక్ట్స్ పెంచుకొని, పరిచయాలతో తెగ తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడప్పుడూ సినిమాలు తీస్తూ నిర్మాతగా తన ఉనికిని కాపాడుకోంటుంటాడు. ఇక ఆమె ఒక సీరియల్ నటి, సినిమాల్లో నటించడానికి ఉవ్విళ్లూరుతూ. మంచి ఫిజిక్ మైంటైన్ చేస్తూ తెగ హడావుడి చేస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి ఒక పార్టీకి వెళ్లారు.

మామూలు పార్టీ అయితే పర్లేదు కానీ.. అది ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన రేవ్ పార్టీ. డ్రింక్స్, డ్రగ్స్ వంటి సరంజామాతో పోలీసులకు కూడా దొరికిపోయారు. అక్కడ జరిగింది ఒక పుట్టినరోజు వేడుక అని, అందరూ ఫ్రెండ్స్ అని వాళ్ళు చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం లాక్ డౌన్ టైంలో రూల్స్ ను అతిక్రమించి ఇలా పుట్టినరోజు వేడుకలు, రేవ్ పార్టీలు నిర్వహించడం పట్ల సీరియస్ అవుతున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.

ప్రస్తుతానికి వాళ్ళ పేర్లు బయటకిరాకుండా జాగ్రత్తపడుతున్నప్పటికీ.. ఎప్పుడో ఒకప్పుడు అవి బయటపడతాయనుకోండి. ప్రస్తుతానికి వీళ్ళంతా కరోనా టెన్షన్ తో భయపడుతున్నారు. అందుకు కారణం ఆ హోటల్ లో వర్క్ చేసే ఒన్నాఫ్ ది ఎంప్లాయికి కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియడమే. అయినా కక్కుర్తి కాకపోతే.. ఈ సమయంలో పార్టీలు అవసరమా!

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus