ప్రముఖ టాలీవుడ్ విలన్లలో శరత్ సక్సేనా ఒకరు కాగా ఈ నటుడు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. శరత్ సక్సేనా పేరు వింటే గుర్తుకు రాకపోయినా ఫోటో చూస్తే మాత్రం ఈ నటుడిని కచ్చితంగా సులువుగా గుర్తు పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. భాషతో సంబంధం లేకుండా 300కు పైగా సినిమాలలో ఈ నటుడు నటించారు.
తెలుగులో సింహాద్రి, బన్నీ సినిమాలు ఈ నటుడికి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ముంబైలో నాకు మంచి పని దొరకడం లేదని అందుకే సౌత్ లో పని చేస్తున్నానని ఆయన తెలిపారు. ముంబైలో నాకు కేవలం ఫైట్ సీన్లు మాత్రమే ఇచ్చేవారని శరత్ సక్సేనా అన్నారు. ఆ సమయంలో ఉదయాన్నే అద్దం చూసుకుంటే నాపై నాకే అసహ్యంగా అనిపించేదని శరత్ సక్సేనా కామెంట్లు చేశారు.
ఎందుకంటే ఉదయాన్నే రెడీ అయ్యి హీరోల చేతిలో దెబ్బలు తినాలని ఆయన వెల్లడించారు. ఈ రీజన్ వల్ల నాపై నాకు అసహ్యం వేసేదని ఆయన తెలిపారు. హీరోలను పరిచయం చేసే సీన్లలోనే విలన్లను ప్రవేశపెడతారని శరత్ సక్సేనా పేర్కొన్నారు. విలన్లను చితకబాదడానికి వచ్చిన వ్యక్తి హీరో అవుతాడని ఆయన కామెంట్లు చేశారు. ఒకరోజు హిందీ సినిమాలు మానేయాలని అనుకున్నానని శరత్ సక్సేనా వెల్లడించారు.
ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత గుణ సినిమాలో ఆఫర్ వచ్చిందని ఆయన తెలిపారు. గూండా రాజ్ మూవీ సమయంలో చిరంజీవిని కలవడంతో తెలుగులో కూడా మూవీ ఆఫర్లు వచ్చాయని ఆయన తెలిపారు. నాగార్జున గారితో కలిసి పని చెప్పానని శరత్ సక్సేనా పేర్కొన్నారు. ప్రియదర్శన్ తో కలిసి ఆరు సినిమాలలో పని చేశానని ఆయన అన్నారు. శరత్ సక్సేనా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!