సీనియర్ నటుడు చలపతిరావు పై మండి పడుతున్న స్టార్స్!

  • May 23, 2017 / 08:24 AM IST

తమ్మడు, అన్న, బాబాయ్, తండ్రి, భర్త, మామ.. ఇలా ఒకటేమిటి రెండువందల పైగా సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు చలపతిరావుపై స్టార్స్ మండిపడుతున్నారు. ఆదివారం జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన చెప్పిన మాటకు సెలబ్రిటీ నుంచి సామాన్యుడు వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకకు హాజరైన చలపతిరావు ని యాంకర్ “అమ్మాయిలు మనః శాంతికి హానికరమా” అని ప్రశ్నించగా.. అందుకు ఆయన “అమ్మాయిలు మనః శాంతికి హానికరం.. కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు” అని చెప్పి విమర్శలకు తావునిచ్చారు. ఇంతవరకు తనపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నారు. మహిళా సంఘాలు వారైతే కనిపిస్తే చెప్పుతో కొడుతామని హెచ్చరిస్తున్నాయి.

మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఆయన మాట్లాడడం తప్పని అక్కినేని నాగార్జున ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టీవీ యాంకర్ శశి .. చలపతి రావుని ప్రశ్నిస్తూ వీడియోని షేర్ చేశారు. “మీ కూతురు, పెళ్ళాం లతో ఇలాగే మాట్లాడతారా?” అని ప్రశించారు. ఆ వేడుకకు హాజరైన వారు ఒక్కరూ కూడా చలపతి రావు మాటలను ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ మాటలకూ అక్కినేని నాగ చైతన్య కూడా ఎంజాయ్ చేసారని సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువగా వస్తుండడంతో దానిని చైతూ ఖండించారు. “చలపతి రావు మాటలకు నేను ఏకీభవించడం లేదు. మహిళలను గౌరవించడం లోనే నా జీవితం సాగుతోంది” అని తాజాగా నాగ చైతన్య ట్వీట్ చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus