ఒకప్పటి టాలీవుడ్ కి…ఈనాటి టాలీవుడ్ కి చాలా తేడా ఉంది…ఎన్టీఆర్…ఎన్నార్ టైమ్ లో ప్రతీ హీరో…చిన్నా పెద్ద తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేవారు…అంటే కాదు…ఏడాది లెక్కల్లో ఎవరెన్ని సినిమాలు తీశారు…ఎన్ని హిట్ అయ్యాయి అని అప్పట్లో ప్రేక్షకులు ఏటి గట్ల పైనా…కూర్చుని మరీ చర్చించుకునే వారు….అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది…ఇప్పుడు ఏడాదికి బడా హీరోలు మహా అయితే రెండు….సినిమాలు మాత్రమే చేస్తున్నారు…మరి ఆనాటి రోజుల్లో ఏడాదికి చేసిన సినిమాల లెక్కల్లో హీరోలు ఎంతమంది….ఆ కధ కమామి ఏంటో చూద్దాం రండి….
‘సూపర్ స్టార్’ కృష్ణటాలీవుడ్ టాప్ హీరో….సాహసమే తన ఊపిరిగా భావించి సినిమాలే ప్రాణంగా అందుకుంటూ…వరుస సినిమాతో దూసుకుపోయారు సూపర్ స్టార్ కృష్ణ. తన కరీర్లో దాదాపుగా 350సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ 1970లో దాదాపుగా 16 సినిమాల్లో నటించి ఒకే ఏడాది విడుదల చేశారు…అంతేకాకుండా 1972లో ఆయనే 18సినిమాల్లో నటించి ఆయన రికార్డును ఆయనే తిరగరాసుకుని సరికొత్త రికార్దుని నెలకొల్పారు.
‘విశ్వవిఖ్యాత’ – ఎన్టీఆర్టాలీవుడ్ ఆరాధ్య దైవం….నటన అన్న పదానికి నీలువెత్తు రూపం…ఆయన తెరపై కనిపిస్తేనే కలక్షన్ల ప్రభంజనం….ఆయనే నందమూరి నట తేజం తారక రామారావు గారు….1964లో కర్ణ సినిమాతో మొదలు పెట్టి….భక్త రామదాసు సినిమాతో దాదాపుగా 16సినిమాల్లో నటించి, అందుల్లో కొన్నింటిని నిర్మించి, మరికొన్నింటికి దర్శకత్వం వహించి ఆ ఏడాది ఎక్కువ సినిమాల్లో నటించిన కధా నాయకుడిగా నిలిచారు ఎన్టీఆర్ గారు.
‘రెబెల్ స్టార్’ – కృష్ణం రాజుటాలీవుడ్ అలనాటి హీరోల్లో రెబెల్ స్టార్ గా ప్రేక్షకుల మదిని దోచుకున్న కృష్ణం రాజు ఆయన కరియర్ మొత్తంలో దాదాపుగా 190సినిమాల్లో నటించారు…అయితే 1974లో దాదాపుగా 17సినిమాల్లో నటించిన ఆయన…ఎక్కువ సినిమాలు హిట్స్ గా నమోదు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.
‘నటకిరీటి’ – రాజేంద్ర ప్రసాద్అతి చిన్న వయసులో డాక్టరేట్ సంపాదించుకుని….కామిడీలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించిన అలనాటి సూపర్ హీరో….టాప్ మోస్ట్ కమీడియన్…రాజేంద్ర ప్రసాద్ గారు….దాదాపుగా 300చిత్రాలకు పైగా నటించి అందరినీ మెప్పించడమే కాకుండా….ఇప్పటికీ ఆయన కామెడీతో అందరినీ అలరిస్తున్న ఆయన 1988లో అత్యధికంగా ఆయన కరియర్ లో 17సినిమాల్లో నటించి మెప్పించారు.
‘మెగాస్టార్’ చిరంజీవిటాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 149 సినిమాల్లో నటించి 150వ సినిమాగా ‘ఖైదీ నెమ్ 150’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 1980ల్లో మెగాస్టార్ హీరోగా దాదాపుగా 14సినిమాల్లో నటించి ఆయన కరియర్ లో సరికొత్త రికార్డ్ ను సృష్టించుకున్నారు…
‘సొగ్గాడు’ శోభన్ బాబుటాలీవుడ్ అందమైన హీరోల్లో ఒకరిన శోభన్ బాబు గారు…ఎన్ని మంచి సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు….అయితే 1959లో దైవభలం సినిమాతో టాలీవుడ్ లో తన కరియర్ ను ప్రారంభించిన మన హీరోగారు…1960, 70లలో మంచి రొమ్యాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నారు…దాదాపు 30ఏళ్ల కరియర్ లో 230సినిమాలకు పైగా నటించిన ఆయన 1980లో అత్యధికంగా 12సినిమాల్లో నటించి ఆయన కరియర్ లోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు.
‘అల్లరి’ నరేశ్రాజేంద్ర ప్రసాద్ గారి తరువాత ఆయనంత ఫాస్ట్ గా…సినిమాలు చేస్తూ….తన తొలి సినిమా అల్లరీని తన ఇంటిపేరుగా మార్చుకుని…దాదాపుగా 15యేళ్ళలో 54సినిమాలకు పైగా నటించాడు మన అల్లరోడు. అయితే 2008లో అత్యధికంగా హీరోగా 8సినిమాల్లో నటించిని పక్క పక్క థియేటర్స్ లో ఆయన సినిమాలు ఆడినా సంధర్భాలు క్రియేట్ చేశారు..
‘నటసింహం’ నందమూరి బాలకృష్ణఇప్పుడు ఎక్కడ విన్నా….హడావిడి అంతా గౌతమీ పుత్ర శాతకర్ణిదే….నందమూరి నటసింహం బాలయ్య 99 సూపర్ సినిమాల తరువాత సంచంలంగా, చరిత్రను తెలియజేస్తూ చేస్తున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. అయితే హిట్స్ ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయిన అతి తక్కువ హీరోల్లో బాలయ్య ఒకరు. 1987లో 7సినిమాల్లో నటించిన బాలయ్య వాటిల్లో 6 సినిమాలు 175 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్దుని నెలకొల్పారు….అంతేకాదు….అప్పటికీ…ఇప్పటికీ ఆ రికార్డును ఎవ్వరూ టచ్ కూడా చెయ్యలేదు అంటే అతిశయోక్తి కాదు.
‘జగ్గుభాయ్’ – జగపతిబాబుటాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోల్లో మన జగపతి బాబు ఒకరు….1974నుంచి 1996 వరకూ మోస్ట్ రొమ్యాంటిక్, ఫ్యామిలీ, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు…ఆ తరువాత బాగా గ్యాప్ తీసుకుని..విలన్ గా మారి లెజెండ్ లో ఇరగదీసేసారు…అక్కడ నుంచి మోస్ట్ వయోలెంట్…..స్టైలిష్…డొమినెంట్ విలన్ గా మెపిస్తూ దూసుకుపోతున్నారు….అయితే హీరోగా కరియర్ పీక్ టైమ్ లో ఉన్న సమయంలో జగపతి బాబు…దాదాపుగా ఒకే ఏడాది 6సినిమాల్లో నటించి మెప్పించారు.