Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

రీసెంట్‌గా ఎంతో గ్రాండ్‌గా జరిగిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) – రష్మిక మందన్న వెడ్డింగ్‌ రిసెప్షన్ కి టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Vijay Devarakonda

కానీ, కొందరు ముఖ్యమైన స్టార్స్ మాత్రం ఈ వేడుకకు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ వాళ్లు ఎందుకు రాలేదో తెలుసుకుందాం.బాలకృష్ణ, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నితిన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఈ పెళ్లిలో ఎక్కడా కనిపించలేదు. అయితే, తాను ఊర్లో లేకపోవడం వల్లే వెడ్డింగ్‌కు రాలేకపోతున్నానని నితిన్ ముందుగానే తెలియజేశారట.

ఇక కిరణ్ అబ్బవరంకు ఈ జంటతో పెద్దగా బాండింగ్ లేకపోవడం వల్లే రాలేదని తెలుస్తోంది.కానీ, మిగతా సెలబ్రిటీలు రాకపోవడానికి ఓ ఆసక్తికరమైన కారణం వినిపిస్తోంది. విజయ్, రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించకుండా.. కేవలం ఒక పీఆర్ ఏజెన్సీ ద్వారా ఇన్విటేషన్స్ పంపడం వల్లే కొందరు హర్ట్ అయ్యారని ఇన్‌సైడ్ టాక్. తమకు పర్సనల్ ఇన్విటేషన్ దక్కలేదనే అసంతృప్తితోనే వాళ్లు ఈ పెళ్లికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

వాస్తవానికి వందలాది మందిని స్వయంగా కలిసి కార్డులు ఇవ్వడం ప్రాక్టికల్‌గా ఏ జంటకైనా కష్టమే అయినా.. పిలుపులో ఆత్మీయత లేదనే ఫీలింగ్ కొందరిలో ఉండిపోయిందట.రష్మిక కెరీర్ మొదలైంది కన్నడ ఇండస్ట్రీలోనే. అయినా అక్కడి నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కృతి శెట్టి మాత్రమే వచ్చారు. కన్నడనాట ఎంతో పేరున్న రాజ్‌కుమార్, శెట్టి ఫ్యామిలీస్ నుంచి ఎవరూ రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కోలీవుడ్ నుంచి కార్తీ, రాధిక శరత్‌కుమార్ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus