ఓ రేంజ్లో ఫైర్ అయిన హీరోయిన్.. వైరల్ అవుతున్న కామెంట్స్..!

ఇప్పుడు బాలీవుడ్లో రోజుకో రచ్చ జరుగుతుంది. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కారణంగా ఏర్పడిన ‘నెపోటిజం’ ఇష్యూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఇది పక్కన పెడితే.. మరోపక్క దీపిక పడుకొనె పై కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే..గతంలో కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ), ఎన్ఆర్‌సీకి… కొందరు నిరసనకు దిగి ఆందోళ‌న‌లు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇది పెద్ద హింసాత్మ‌కంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో కొందరు దుండగులు ముసుగు వేసుకుని.. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ(జేఎన్‌యూ)లోకి ఎంటర్ అయ్యి స్టూడెంట్స్ పై దాడి చేశారు.దీంతో చాలా మంది గాయపడ్డారు. ఈ క్రమంలో విద్యార్థుల‌కు సంఘీభావం తెలుపుతూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే ‌జేఎన్‌యూకు వెళ్లడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. దీపికా జేఎన్‌యూకి వెళ్ళడానికి 5 కోట్ల తీసుకుందంటూ ఇప్పటికీ ప్ర‌చారం జరుగుతూనే ఉంది.

ఈ విషయం మరో హీరోయిన్ స్వర భాస్కర్ ను ఇటీవల ప్రశ్నించగా.. ఆమె ఓ రేంజ్లో మండిపడింది. “ఇవి పూర్తిగా అర్ధం పర్ధం లేని వ్యవహారం. రెండు నిముషాలు జె.ఎన్.యు లో ఉన్నందుకే 5 కోట్లు ఇచ్చారా? నాకు వెబ్ సిరీస్ లలో కూడా అవకాశం ఇవ్వలేదా? సినిమా వాళ్ళ గురించి మరీ ఇంత చెత్తగా ఎలా మాట్లాడుకుంటారు..? సినిమా వాళ్లు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా ..?” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ జవాబిచ్చింది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus