Sudheer Babu: ‘హంట్’ ఫలితం పై స్పందించిన సుధీర్ బాబు!

  • October 6, 2023 / 10:54 AM IST

సుధీర్ బాబు.. కృష్ణ మేనల్లుడిగా, అల్లుడిగా మాత్రమే కాదు.. మహేష్ కి బావమరిదిగా అలాగే ప్రామిసింగ్ హీరోగా కూడా బాగా ఫేమస్. పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ .. ఇతను పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసి స్టార్ అవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. కృష్ణ గారు తలచుకున్నా, మహేష్ తలచుకున్నా.. పెద్ద బ్యానర్లు, పెద్ద డైరెక్టర్లు.. సుధీర్ బాబు కోసం రంగంలోకి దిగడం అనేది పెద్ద పని కాదు. కానీ సుధీర్ బాబు ఆ ఇన్ఫ్లుయెన్స్ ను ఎప్పుడూ వాడుకోలేదు.

సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించాలని, టాలెంటెడ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వాలని అతను ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు.జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు సుధీర్ బాబు. ఈ క్రమంలో సుధీర్ బాబు.. ‘హంట్’ అనే సినిమాతో జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ సూరపనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. కానీ మొదటి షోతోనే ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

క్రిటిక్స్ నుండీ మొదటి రోజు మార్నింగ్ షో ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమాని ఏకిపారేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రెండో రోజుకే వాషౌట్ అయిపోయింది.ఈ సినిమాలో సుధీర్ బాబు ‘గే’ గా కనిపించడాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. తాజాగా ఈ విషయాన్ని సుధీర్ బాబు కూడా ఒప్పుకున్నాడు.” ‘హంట్’ సినిమా ఫలితం నన్ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ విషయంలో ప్రేక్షకుల తప్పులేదు. నన్ను క్లైమాక్స్ లో అలా చూడలేకపోయారు.

ప్రేక్షకుల వరకు ఎందుకు.. నా భార్య, స్నేహితులు కూడా అలాంటి పాత్రలో నన్ను జీర్ణించుకోలేకపోయారు. అయితే విమర్శకుల నుండి ఎంతో కొంత మెచ్చుకోలు వస్తుందని అనుకున్నాను. ‘హంట్’ వాళ్ళని సైతం మెప్పించలేకపోయింది. ఈ సినిమా నాకు పెద్ద గుణపాఠమే నేర్పింది. ఇకపై ప్రయోగాలు చేయను. ఎలాంటి కథ అయినా ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చేలా చేయాలని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు (Sudheer Babu) సుధీర్ బాబు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus