జాక్వెలిన్ అమాయకురాలు అంటోన్న సుఖేష్!

  • October 24, 2022 / 12:01 AM IST

రూ.200 కోట్ల విలువైన స్కామ్ లో సుఖేష్ చంద్రన్ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సుఖేష్ సన్నిహితురాలు, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు కూడా ఈ కేసు విషయంలో నోటీసులు అందించారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఆమెని పలుసార్లు విచారణ కూడా చేశారు. సుఖేష్ నుంచి జాక్వెలిన్, ఆమె కుటుంబ సభ్యులు దాదాపు రూ.12 కోట్ల వరకు బహుమతులు పొందినట్లుగా ఈడీ పేర్కొంది.

ఈ మేరకు జాక్వెలిన్ బ్యాంక్ డిపాజిట్లను కూడా ఈడీ అటాచ్ చేసింది. అయితే ఇప్పటివరకు ఆమెని అరెస్ట్ అయితే చేయలేదు. ప్రస్తుతం జాక్వెలిన్ సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. ఇదిలా ఉండగా.. జాక్వెలిన్ ను ఉద్దేశిస్తూ సుఖేష్ తన లాయర్ కు ఒక లెటర్ రాశాడట. ఆ లెటర్ లో జాక్వెలిన్ అమాయకురాలని, ఆమె తన నుంచి బహుమతులు పొందిన మాట నిజమే కానీ.. ఆ డబ్బు మొత్తం తను కష్టపడి సంపాదించిందని అంటున్నాడు సుఖేష్.

స్కామ్ డబ్బు వేరే అని.. తను జాక్వెలిన్ కోసం పెట్టిన ఖర్చు వేరే అని చెబుతున్నాడు సుఖేష్. తనకు కోల్ మైన్స్ ఉన్నాయని.. టీవీ ఛానెల్స్ లో షేర్స్ ఉన్నాయని.. అలా తను ఆర్జించిన మొత్తంలో కొంత జాక్వెలిన్ కోసం ఖర్చు పెట్టినట్లుగా సుఖేష్ తన లేఖలో పేర్కొన్నాడట. తను.. జాక్వెలిన్ ఒకప్పుడు బంధంలో ఉండేవారని.. ఆ సన్నిహిత్యంతోనే ఆమెకి బహుమతులు ఇచ్చినట్లుగా పేర్కొన్నాడు సుఖేష్.

ఆ గిఫ్ట్ లు తమ బంధానికి ప్రతీకారులు అని.. తను చట్టబద్ధంగా సంపాదించిన డబ్బుతోనే ఆమెకి గిఫ్ట్ లు ఇచ్చినట్లుగా సుఖేష్ తన లాయర్ కి వివరించాడట. దీనిపై విచారణ జరిగితే మొత్తం స్పష్టం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశాడట. జైల్లో ఉన్నప్పటికీ.. జాక్వెలిన్ ని కాపాడడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు సుఖేష్. మరి ఆమె ఈ కేసు నుంచి బయటపడుతుందో లేదో చూడాలి!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus