Sukumar, Samantha: సామ్ కు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నా.. సుక్కూ చెప్పిన విషయాలివే!

  • April 4, 2024 / 06:54 PM IST

స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)  ఆర్య సినిమా నుంచి పుష్ప ది రైజ్ (Pushpa) సినిమా వరకు తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా హిట్ గా నిలిచేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సుకుమార్ అభిమానులకు మాత్రం ఆ సినిమాలు ఎంతగానో నచ్చాయి. సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

పుష్ప ది రూల్ (Pushpa 2)  సినిమాకు హైలెట్ అయ్యే అంశాలతో ఈ టీజర్ ను కట్ చేశారని తెలుస్తోంది. మరోవైపు సుకుమార్ ఒక సందర్భంలో సమంత గురించి, ఆమె టాలెంట్ గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రంగస్థలం సినిమా కోసం మొదట కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని భావించిన సుకుమార్ ఆ తర్వాత ఆ విషయంలో వెనక్కు తగ్గారట.

పల్లెటూరి అమ్మాయి రోల్ కు సమంత (Samantha) బాగా సూట్ అవుతుందని భావించిన సుకుమార్ చివరకు సమంతను ఎంపిక చేశారట. అయితే సినిమాలో సమంత పలికించిన ఎక్స్ ప్రెషన్స్, నటించిన తీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యానని సమంత అంత బాగా చేసిందని ఆయన వెల్లడించారు. ఆ మూవీ ఈవెంట్ నేను సినిమాల్లో కెరీర్ ను కొనసాగించినంత కాలం సమంతకు ఛాన్స్ ఇస్తూనే ఉంటానని చెప్పానని సుకుమార్ తెలిపారు.

రంగస్థలం (Rangasthalam) సినిమాలో లిప్ లాక్ సీన్ కథకు అవసరమని అందుకే సినిమాలో పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. సందర్భం వస్తే అబ్బాయి అమ్మాయి చేతిని పట్టుకోవడం ఎంత ముఖ్యమో ముద్దు పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని సుకుమార్ కామెంట్లు చేశారు. సుకుమార్ భవిష్యత్తు సినిమాలలో సైతం సమంత కనిపించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. సుకుమార్ టాలెంట్ ను నెటిజన్లు సైతం తెగ ప్రశంసిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus