Sukumar: విరూపాక్షలో సుకుమార్ పెట్టుబడులు పెట్టలేదా.. అసలు ట్విస్ట్ ఇదేనా?

టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ విరూపాక్ష సినిమా కోసం స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు కావడం వల్లే ఆయన శిష్యులు తీసిన సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు కాకపోయినా సుకుమార్ ఆలోచనలకు అనుగుణంగా సినిమాను తెరకెక్కించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమాను తెరకెక్కించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే ఈ సినిమాలో సుకుమార్ ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని ఈ సినిమా స్క్రీన్ ప్లే వర్క్ కోసం పని చేసినందుకు 6 కోట్ల రూపాయలు సుకుమార్ తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు జరిగిన బిజినెస్ ఆధారంగా సుకుమార్ లాభాల్లో వాటా తీసుకున్నారని సమాచారం. మరోవైపు కార్తీక్ దండు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ జానర్ కు నేను అభిమానినని ఒక పేపర్ లోని ఆర్టికల్ ఆధారంగా స్ట్రిక్ట్ హారర్ మూవీ తీయాలని అనుకున్నానని ఆయన తెలిపారు. అలా విరూపాక్ష తెరకెక్కిందని ఆయన అన్నారు.

విరూపాక్ష మూవీ విషయంలో సుకుమార్ (Sukumar) ప్రౌడ్ గా ఉన్నారని కార్తీక్ దండు కామెంట్లు చేశారు. హీరోను, ప్రొడ్యూసర్ ను సుకుమార్ సెలెక్ట్ చేశారని హీరోయిన్ ను నేను సెలెక్ట్ చేశానని ఆయన అన్నారు. సాయితేజ్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో నేను కూడా కోమాలోనే ఉన్నానని కార్తీక్ దండు అన్నారు. హారర్ థ్రిల్లర్ గానే తర్వాత సినిమాలు కూడా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

నాది వైజాగ్ అని ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరి అడ్వాన్స్ లు తీసుకోలేదని కార్తీక్ దండు చెప్పుకొచ్చారు. కార్తీక్ దండు కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus