Allu Arjun: బన్నీ ఏంటి ఇలా మారిపోయాడు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?

  • February 7, 2024 / 06:36 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ సీక్వెల్ సినిమాని అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీ విడుదల చేయాలన్న ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో భారీ సెట్ వేసి అక్కడే చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది.

అయితే తాజాగా సుకుమార్ భార్య తబిత పుష్ప షూటింగ్ లోకేషన్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈమె అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో అచ్చం ఆ ఫోటో సుకుమార్ మాదిరిగానే కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.

ఇదేందయ్యా ఇది ఎంత నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా అయితే మాత్రం హీరోని నీలాగే మార్చుకోవాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక చాలామంది తొందరగా చూసి సుకుమార్ అనుకున్నానే అంటూ కూడా ఈ ఫోటో పై కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోలలో అల్లు అర్జున్ సుకుమార్ మాదిరిగానే గుబురు గడ్డం కళ్ళజోడు పెట్టుకొని ఉండడంతో ఆయన పోలికలతోనే కనిపిస్తున్నారు.

దీంతో ఈ ఫోటో పైన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమాలో (Allu Arjun) అల్లు అర్జున్ ఇలా విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక నటించబోతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus