Suman: చంద్రబాబు అరెస్ట్ గురించి సుమన్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి తాజాగా సుమన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో సుమన్ మాట్లాడుతూ చంద్రబాబు పుట్టినరోజు సరిగ్గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలుస్తుందని ఆయన అన్నారు. సమయం అనేది బాగుంటే లోకల్ కోర్టులో సైతం అన్నీ అనుకూలంగా జరుగుతాయని సుమన్ తెలిపారు.

చంద్రబాబుకు అన్నీ అనుకూలంగా వచ్చే వరకు జైలులోనే ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ సీఎంను అరెస్ట్ చేసే సమయంలో అన్నీ ఆలోచించాకే అరెస్ట్ చేసి ఉంటారని సుమన్ పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లాడని అంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది నిజం కాదని సుమన్ కామెంట్లు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉండి ఉంటాయని సుమన్ అన్నారు.

సమయం మనకు ప్రతికూలంగా ఉన్న సమయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. సుమన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సుమన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. సుమన్ కామెంట్ల గురించి టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. సుమన్ రెమ్యునరేషన్ రోజుకు 10 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.

సుమన్  (Suman) వయస్సు ప్రస్తుతం 64 సంవత్సరాలు కాగా కొన్ని సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. సుమన్ దేవుని పాత్రలలో నటించి ఆ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. సుమన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఇతర భాషల్లో సైతం సుమన్ ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus