సినిమా అవకాశాలు ఇప్పిస్తాంటూ కొంత మంది మాయ మాటలు విని గుడ్డిగా నమ్ముతున్నారు అమ్మాయిలు. అలా కొంత మంది అమ్మాయిలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారు. ఆ ఊబిలో నుండి బయటకు రాలేక.. అటు అవకాశాలు రాక చివరకు వేశ్యలుగా మారిపోతున్నారు. నటన మీద మక్కువతో కొంత మంది అమ్మాయిలు సినిమాల వైపు రావాలని భావిస్తుంటారు. అందుకోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంటారు. మోడలింగ్ చేస్తూనే సినిమా ప్రయత్నాలను కొనసాగిస్తూ పరిచయాలు పెంచుకుంటారు. పరిశ్రమలో చాలా మంది నటీమణులు ఇలా వచ్చిన వారే.
అయితే ఈ క్రమంలో సినిమా అవకాశాలు ఇప్పిస్తాంటూ కొంత మంది మాయ మాటలు చెప్పడంతో గుడ్డిగా నమ్ముతున్నారు. అలా కొంత మంది అమ్మాయిలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారు. ఆ ఊబిలో నుండి బయటకు రాలేక.. అటు అవకాశాలు రాక చివరకు వేశ్యలుగా మారిపోతున్నారు. వెండితెరపై వెలగాలని ఆశిస్తున్న ఎంతో మంది మహిళలు.. వేశ్యా గృహాలకే పరిమితమౌతున్నారు. అయితే వీరిని వ్యభిగార గృహాలకు తరలిస్తుండటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వారిలో మహిళలు, నటీమణులు ఉండటం గమనార్హం. అవకాశాల పేరుతో పలువురు మోడల్స్‌కు వలవేసి వ్యభిచార ఊబిలోకి దింపిన నటి ఆర్తి మిట్టల్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే.
అయితే తాజాగా మరో నటి బాగోతం బయట పడింది. హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠాను గుట్టు రట్టు చేశారు ముంబయి పోలీసులు. మోడల్స్‌తో వ్యభిచారం చేయిస్తున్న భోజ్ పురి నటి సుమన్ కుమారిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ చేపట్టి మరీ ఈ రాకెట్‌ను చేధించారు. నగరంలోని గోరెగావ్‌లోని రాయల్ పామ్ హోటల్‌లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 24 ఏళ్ల సుమన్ కుమారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యవర్తిగా ఉంటూ వ్యభిచారంలోకి అమ్మాయిలను ఆమె నెట్టివేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌లో భాగంగా ఓ సుమన్ కుమారి అనే పేరుతోనే ఫేక్ కస్టమర్‌ను పంపారు. అయితే అక్కడే ఉన్న నటి సుమన్ కూడా ఈ వలలో చిక్కింది. ఆమె ఆ నకిలీ కస్టమర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది, అందులో ఆమె ఒక్కో మోడల్‌కు 50 నుండి 80 వేల రూపాయలు డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో ఆమె రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.
సినిమా కెరీర్ కోసం ముంబయికి వచ్చి డబ్బుల కోసం కష్టపడుతున్న వారిని ట్రాప్ చసి వ్యభిచార గృహంలోకి లాగి, కస్టమర్లకు మోడల్స్ సరఫరా చేసేదని పోలీసులు చెప్పారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్‌ను పోలీసులు రక్షించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమన్ కుమారి అనేక భోజ్‌పురి చిత్రాలలో నటించింది. ‘లైలా మజ్ను’తో పాటు ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’ వంటి భోజ్‌పురి కామెడీ షోలు కూడా చేసింది. ఇది కాకుండా, ‘బూమ్’ OTT ఛానెల్‌లో కూడా పనిచేసింది.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?