గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నగ్నంగా నడిరోడ్డు మీద బైఠాయించిన సునీత బోయ..!

జూనియర్ ఆర్టిస్టు సునీత బోయ మరోసారి కాంట్రవర్సీ క్రియేట్ చేసింది.. జూబ్లీ హిల్స్ రోడ్ నెం.45లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నడిరోడ్డుపై నగ్నంగా బైఠాయించింది. ఊహించని ఈ సంఘటనతో అంతా షాక్ అయ్యారు.. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయినా సరే.. వారి మాట కూడా వినకుండా రచ్చ రచ్చ చేసింది.. బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ రచ్చ రచ్చ చేసింది..

సునీత బోయ అనే యువతి గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఇలా హంగామా చెయ్యడం ఇది మొదటి సారి కాదు.. గతకొంత కాలంగా ఆమె నిర్మాత బన్నీ వాసుని టార్గెట్ చేస్తూ.. అతని మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది.. ఇలాగే పలుమార్లు ఫిలింఛాంబర్ ఎదుట, గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద బయట బైఠాయించి, నానా హంగామా చేసింది.

బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశమిస్తానని చెప్పి నమ్మించి, వాడుకుని మోసం చేశాడంటూ సునీత పలుమార్లు ఆరోపించింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.. సరైన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు కేసు కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చింది. అప్పటి నుండి సైలెంట్‌గా ఉన్న సునీత ఇప్పుడు మరోసారి రచ్చ చేసింది.. బన్నీ వాసు తనను వేధిస్తున్నాడని..`తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదంటూ మొండికేసింది. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు.. ఓయువతి ఆమె ఒంటిమీద వస్త్రాలు కప్పింది..

నిత్యం రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్ రోడ్డు మీద సునీత బోయ రచ్చ చేయడంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.. గతంలోనూ ఇలానే పలుమార్లు హంగామా చేయడంతో పోలీసులు వచ్చి జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషనుకి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, కావాలనే బన్నీ వాసుని టార్గెట్ చేస్తుందని కూడా అంటున్నారు. కోర్టు కూడా బన్నీ వాసుకే సపోర్ట్ చేసింది.. అయినా సునీత మళ్లీ ఇలా చేసిందంటే ఆమె ఉద్దేశమేంటి? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి .. మరి సునీత విషయంలో బన్నీ వాసు ఎలా స్పందిస్తాడనేది చూడాలి..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus