బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny Leone) ఓ భారీ ఆర్దిక కుంభకోణంలో చిక్కుకోవడం సంచలనమైంది. ఆమెతో పాటు కన్నడ సినీ ప్రముఖులు ఈ వివాదంలో భాగం కావడం అనేది షాకిచ్చే అంశం.వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ‘శివం అసోసియేట్స్’ అనే సంస్థ ప్రజల నుండి అక్రమంగా ఏకంగా రూ.2400 కోట్లు డిపాజిట్లను వసూలు చేసిందట. ఇది దేశంలోనే పెద్ద స్కామ్ అని తెలుస్తోంది.ఈ పోంజీ స్కామ్‌కు పాల్పడిన ‘శివం అసోసియేట్స్’ అధినేత శివానంద నీలణ్ణవరపై ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా… ఈ అక్రమ సొమ్ము సినీ రంగానికి కూడా మళ్లినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో ‘శివం అసోసియేట్స్’ అధినేత 2023లో ‘ఛాంపియన్’ అనే సినిమాను నిర్మించారు.
ఈ సినిమాలో కేవలం ఒక్క స్పెషల్ సాంగ్ చేసినందుకే సన్నీ లియోన్‌కు రూ.1 కోటి పారితోషికం ఇచ్చారని సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రజల నుండి దోచుకున్న అక్రమ సొమ్ముతోనే సన్నీలియోన్ కు అంతా మొత్తం పారితోషికం ఇచ్చారా? అనే కోణంలో ఇప్పుడు పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారట. ఆల్రెడీ ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ సన్నీ లియోన్‌కు నోటీసులు కూడా పంపారట సీఐడీ అధికారులు.
సన్నీ లియోన్ కి మాత్రమే కాదు 2025 డిసెంబర్‌లో నిర్వహించిన ‘కన్నడ ఉత్సవం’ వేడుకల్లో పాల్గొన్న మరికొంతమంది సినీ నటులకు కూడా పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కన్నడ నటులు డాలి ధనంజయ్, కాంతార హీరోయిన్ సప్తమి గౌడ, ‘ఓదెల 2’ విలన్ వశిష్ట సింహ, రాగిణి ద్వివేది వంటి వారికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు పంపారట. త్వరలోనే వారిని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.