సన్నీ లియోన్ ని ఫోన్ నంబర్ అడిగితే ఏమి చేసిందో తెలుసా?

Advertisement

అడల్ట్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన సున్నీ లియోన్ బాలీవుడ్ లో అనతి కాలంలో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తరువాత లెక్కకు పైగా అడల్ట్ కంటెంట్ మూవీస్ లో నటించి యూత్ లో పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్స్ కి మించి గూగుల్ ఆమె కోసం యువత సెర్చ్ చేస్తున్నారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు, అనేక సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాలలో కూడా రాణిస్తుంది. కాగా ముంబై వేదికగా జరిగిన దబ్బో రత్నాని క్యాలెండర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ లియోన్ కి ఓ వింత అనుభవం ఎదురైంది.

సీనియర్ నటుడు కబీర్ బేడీ ఈ ఈవెంట్ లో సన్నీ లియోన్ ఫోన్ నంబర్ అడిగారట. దబ్బో రత్నాని క్యాలెండర్ లో నీఫోటోలు చాల అద్భుతంగా ఉన్నాయి అని పొగిడిన కబీర్ బేడీ, సన్నీ లియోన్ వ్యక్తి గత ఫోన్ నంబర్ అడిగారట. ఐతే సన్నీ లియోన్ తెలివిగా తన భర్త డేనియల్ వెబర్ ఫోన్ నంబర్ ఇచ్చి, నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా మా ఆయనకి ఫోన్ చేయండి అందట. దీనితో కబీర్ బేడీ ఖంగు తిన్నాడట. కొంచెం ఇబ్బందికర పరిస్థితి నుండి చాకచక్యంగా తప్పించుకున్న సన్నీ లియోన్ మెచ్చుకోవాల్సిందే. ఫోన్ నంబర్ ఇవ్వడం కుదరదు అనకుండా భర్త ఫోన్ నంబర్ ఇచ్చి, కబీర్ బేడీకి షాక్ ఇచ్చింది.

 


‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read