Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ సినిమాలకు అరుదైన గౌరవం.. మరో రికార్డ్ అంటూ?

  • April 26, 2024 / 12:41 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ లో (Trivikram)  తెరకెక్కిన అతడు (Athadu) , ఖలేజా, (Khaleja) గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకున్నా బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అతడు, ఖలేజా సినిమాలను ఈతరం ప్రేక్షకులు సైతం ఎంతో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రెండు సినిమాలకు అరుదైన గౌరవం దక్కడం హాట్ టాపిక్ అవుతోంది. అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల గురించి చర్చ జరిగే వేదిక అయిన లెటర్ బాక్స్డ్ తాజాగా ఎక్కువ సంఖ్యలో అభిమానుల మెప్పు పొందిన టాప్ 100 సినిమాల జాబితాను ప్రకటించడం జరిగింది.

ఈ జాబితాలో మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు ఉన్నాయి. అతడు సినిమా 42వ ర్యాంక్ ను సొంతం చేసుకోగా ఖలేజా సినిమా 85వ ర్యాంక్ ను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడో విడుదలైన మహేష్ సినిమాలు ఇప్పటికీ అరుదైన రికార్డులు సొంతం చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జెర్సీ (Jersey) , సాగర సంగమం సినిమాలు సైతం ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.

అతడు, ఖలేజా సినిమాలకు దక్కిన అరుదైన గౌరవం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ కూడా అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం. రాజమౌళి  (S. S. Rajamouli)  సినిమాతో మహేష్ మరిన్ని భారీ రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ (RRR)  తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చవుతోందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus