మహేష్ బాబుని కలిసిన ముఖ్యమంత్రి!

  • June 18, 2018 / 10:16 AM IST

భరత్ అనే నేను చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు. నటించారు అనడం కంటే జీవించేసారు అనడం ఉత్తమం. ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యారు. భరత్ లాంటి ముఖ్యమంత్రి తమకి ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు ఫీలయ్యారు. అందుకే ఆ చిత్రం 200కోట్ల కలక్షన్స్ రాబట్టింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ నెక్స్ట్ సినిమాని మొదలెట్టారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరక్కనున్న మహేష్ 25 వ మూవీ షూటింగ్ ఈరోజు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో మొదలైంది. మహేష్, అల్లరి నరేష్  తో పాటు మరికొంతమంది నటీనటులు ఇందులో పాల్గొన్నారు.

కాలేజీలో జరిగే ఈ సన్నివేశాలను 20 రోజుల పాటు షూట్ చేయనున్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వయంగా షూటింగ్ స్పాట్ కి వెళ్లి మహేష్ బాబుని కలిశారు. రియల్ ముఖ్యమంత్రికి రీల్ ముఖ్యమంత్రి స్వాగతం పలికిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న విషయం అక్కడి ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ అయింది. మహేష్ అభిమానులు సైతం ఈ విషయాన్నీ గర్వంగా  చెప్పుకుంటున్నారు. అశ్విని దత్, దిల్ రాజులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus