Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Advertisement

ఒకప్పటి హీరోయిన్ ప్రత్యూష(Prathyusha) గురించి ఇప్పటి జెనరేషన్ కి పెద్దగా తెలిసుండకపోవచ్చు. గతంలో ఈమె ఉదయ్ కిరణ్ వంటి హీరోల సరసన నటించి క్రేజ్ సంపాదించుకుంది. అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న ఈమె … ఎవ్వరూ ఊహించని విధంగా 2002లో మరణించింది. బాయ్ ఫ్రెండ్ సిద్దార్ధ్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ ఈమెను రే*ప్ చేసి హతమార్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. సిద్దార్థ్ రెడ్డిపై అయితే కేసు నమోదైంది.

Prathyusha

అయితే అతని ఫ్రెండ్స్ కి రాజకీయ పలుకుబడి ఉండటంతో తప్పించుకున్నట్టు కూడా చాలా మంది చెబుతుంటారు. ఈ క్రమంలో సిద్దార్థ్ రెడ్డి అరెస్ట్ అవ్వడం. కోర్టు అతనికి 2 ఏళ్ళ పాటు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అయితే హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి అండ్ ఫ్యామిలీ సుప్రీంకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు.దీనికి ప్రత్యుష తల్లి సరోజిని సిద్దార్థ్ రెడ్డికి శిక్ష పెంచాలంటూ కౌంటర్ దాఖలు చేశారు.

దీన్ని 2025 నవంబర్లో రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో ప్రత్యూష అభిమానులు, అలాగే ఆమె మద్దతుదారులు ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు.. అలాగే సిద్దార్థ్ రెడ్డిని శిక్షించాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ వచ్చారు. ఇక దీని పై తుది తీర్పు ఈరోజు ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పుకి మద్దతిస్తూ సిద్దార్ధ్ రెడ్డికి కఠిన కారాగార శిక్ష విధించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. సిద్దార్థ్ రెడ్డి లొంగిపోవాలంటూ..అతనికి 4 వారల గడువు కూడా ఇవ్వడం గమనార్హం.

నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus