కొత్త స్కెచ్ వేసిన నిర్మాత సురేష్ బాబు…!

ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు.. ఏ స్క్రిప్ట్ కు ఎంత బడ్జెట్ పెట్టాలి. సినిమాకి పెట్టిన బడ్జెట్ మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలి అనే విషయంలో మన టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు ఆరి తేరిపోయి ఉన్నారు. ఎంత మంది నిర్మాతలు వచ్చినా.. ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు.. ఏ స్క్రిప్ట్ కు ఎంత బడ్జెట్ పెట్టాలి. సినిమాకి పెట్టిన బడ్జెట్ మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలి అనే విషయంలో మన టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు ఆరి తేరిపోయి ఉన్నారు. ఎంత మంది నిర్మాతలు వచ్చినా.. ఈయన తన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను రిలీజ్ చేసి.. రికార్డు విజయాల్ని సొంతం చేసుకుంటూ వస్తున్నారు సురేష్ బాబు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటి అంటే.. భవిష్యత్తు అంతా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ దే అని ఈ లాక్ డౌన్ చిన్న ఉదాహరణ చూపిస్తుంది.

ఈ పాటికే ఓటిటి ప్లాట్ ఫామ్స్ బిజినెస్ రంగంలోకి దిగిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు మంచి బోణి దక్కింది. చిన్న సినిమాలకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వారు కోట్ల రూపాయలు ఆఫర్ లు ఇస్తున్నారు. కాబట్టి ఇక చిన్న సినిమాలు థియేటర్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొద్ది మొత్తం నష్టాలతో అయినా బయటపడొచ్చు అని చిన్న నిర్మాతలు భావిస్తున్నారు. అయితే సురేష్ బాబుకి ఓ సూపర్ ఐడియా వచ్చింది.

ఇప్పుడు ఓ కథ పట్టుకుని నిర్మాతల కోసం వెతుకులాట మొదలుపెట్టడం కంటే కూడా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వారే చిన్న సినిమాలను నిర్మిస్తే చాలా బెటర్ కదా. అప్పుడు నిర్మాత కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. అందులోనూ వారికి నచ్చిన కంటెంట్ నే నిర్మించుకోవచ్చు.. అని సురేష్ బాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజానికి ఇది చాలా గొప్ప ఆలోచనే..!

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus