కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సూర్యకు కేవలం తమిళ చిత్రపరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలు కూడా ఎంతో మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. సినీనటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సూర్య తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇక జ్యోతిక సూర్య పెళ్లి చేసుకోవడంతో జ్యోతికకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకో అంటూ సూర్యకు సలహా ఇచ్చారట ఇలాంటి సలహా ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే.. ఆయన మరెవరో కాదు సూర్య తండ్రి శివకుమార్. సూర్యకు మొదటి నుంచి తన తండ్రి అంటే కొంత భయం ఉండేది. అయినప్పటికీ ఈయన సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత జ్యోతికతో కలిసి పలు సినిమాలలో నటించడంతో ఆమెపై ప్రేమ పుట్టింది.
ఇలా ప్రేమించుకున్నటువంటి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే ఈ విషయం తన తండ్రి కి చెప్పాలంటే సూర్య భయపడి ఈ విషయాన్ని దాచి పెట్టారట. ఇక తన కొడుకుకి పెళ్లి చేయాలని శివకుమార్ భావించగా సూర్య మాత్రం ఈ విషయాన్ని తన ఫ్రెండ్ కి చెప్పి తన ఫ్రెండ్ సహాయంతో జ్యోతికను రిజిస్టర్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి విషయాన్ని తన తండ్రి వద్ద దాచినటువంటి ఈయన కొంతకాలం పాటు పెళ్లి వద్దని తాను సినిమాలలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ పెళ్లిని వాయిదా వేశారు.
ఇక సూర్య జ్యోతికకు (Suriya, Jyothika) వివాహం జరిగిందనే విషయం తెలుసుకున్నటువంటి శివకుమార్ తన కొడుకును పిలిచి తనకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా తనతో విడాకులు తీసుకో నీకు మరొక పెళ్లి చేస్తానని చెప్పారట. తండ్రి మాటలకు సూర్య మాట్లాడుతూ మీకు ఈ విషయం చెప్పడానికి భయపడే నేను తనని రహస్యంగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తనని వదిలేసే ప్రసక్తే లేదు అంటూ మొదటిసారి తన తండ్రికి ఎదురు చెప్పారట. ఇలా తన కొడుకు ఎదురు చెప్పడంతో చేసేదేమీ లేక మరోసారి వీరిద్దరికీ ఎంతో ఘనంగా వివాహం చేశారని తెలుస్తోంది.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !