తమిళ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటుడిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు విజయ్ కాంత్ గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. విజయ్ కాంత్ ఇదివరకే ఎన్నోసార్లు అనారోగ్యానికి గురై ఆయన కోలుకొని క్షేమంగా తిరిగి బయటకు వచ్చారు. అయితే తాజాగా మరోసారి అనారోగ్యానికి గురై గత 15 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమించడంతో అందరూ అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన క్షేమంగా తిరిగి రావాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా విజయ్ కాంత్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన కోమాలోకి వెళ్లిపోయారని వార్తలు వైరల్ అయ్యాయి.
గత రెండు రోజుల క్రితం విజయ్ కాంత్ మరణించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవం అంటూ విజయ్ కాంత్ సతీమణి వీడియోలు ఫోటోలతో సహా విజయ్ కాంత్ గారిని చూపించడంతో ఒకసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే విజయ్ కాంత్ ఆరోగ్య విషయం గురించి తాజాగా నటుడు సూర్య సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
నటుడు సూర్య (Suriya) విజయ్ కాంత్ గారి భార్యకు ఫోన్ చేసి మరి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆమెకు ధైర్యం కూడా చెప్పారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సూర్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విజయ్ కాంత్ అన్న కోలుకోవాలని ప్రార్థించే కోట్లాదిమంది అభిమానులలో తాను ఒక్కడినంటూ పోస్ట్ చేశారు. కోట్లాదిమంది ప్రార్థనలు నెరవేరుతాయని ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి బయటకు వస్తారు అంటూ సూర్య చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!