SV Krishna Reddy: గుంటూరు కారం రిజల్ట్ పై ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్ వైరల్.. ఏమన్నారంటే?

  • February 5, 2024 / 08:04 PM IST

ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన గుంటూరు కారం మూవీ మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమైంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదుర్స్ అనిపించినా కథ, కథనం విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఇలాంటి సినిమా ఎందుకు తెరకెక్కించాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గుంటూరు కారం సినిమా గురించి తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.

హీరోలకు అనుగుణంగా చేయాలని భావించడం వల్లే టాప్ హీరో, వజ్రం సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు కారం సినిమా ఫ్లాప్ కావడానికి సైతం అదే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. మహేష్ బాబు స్టార్ డమ్ కు అనుగుణంగా సినిమా తీయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నించారని అలా చేయడం వల్లే గుంటూరు కారం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది. గుంటూరు కారం కథ విషయంలో, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగి ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

మహేష్ తర్వాత సినిమా జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో మహేష్ లుక్ ఇదేనంట్లూ కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేష్ ఎలా ఉన్నా అందంగా కనిపిస్తారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus