Swathimuthyam Collections: ‘స్వాతి ముత్యం’ మొదటి రోజు పర్వాలేదనిపించింది..!

  • October 6, 2022 / 04:04 PM IST

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం ‘స్వాతి ముత్యం’.నూతన దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 5న విజయదశమి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. క్రమక్రమంగా ఈ చిత్రం షోలు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. రెండు పెద్ద సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుండడం విశేషం. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.11 cr
సీడెడ్ 0.05 cr
ఉత్తరాంధ్ర 0.07 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.06 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.57 cr

‘స్వాతి ముత్యం’ చిత్రానికి రూ.3.84 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ ను రాబట్టుకున్న ఈ మూవీ.. ప్రీమియర్స్ తో కలుపుకుని రూ.0.57 కోట్ల షేర్ ను రాబట్టింది.

‘గాడ్ ఫాదర్’ ‘ది ఘోస్ట్’ వంటి బడా చిత్రాలు ఉన్నా ఈ మూవీ ఇంత కలెక్ట్ చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. రెండో రోజు కూడా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus